'చిల్లర' వ్యాఖ్యలపై మిస్ వరల్డ్ మానుషీ ధీటుగా, హుందాగా: శశిథరూర్ క్షమాపణ
కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చేసిన 'చిల్లర' వ్యాఖ్యలపై ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ సోమవారం నాడు స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలకు తాను కలత చెందనని చెప్పారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చేసిన 'చిల్లర' వ్యాఖ్యలపై ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ సోమవారం నాడు స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలకు తాను కలత చెందనని చెప్పారు. తద్వారా థరూర్‌కు గట్టి షాకిచ్చారు.
చదవండి: బీజేపీ పైకి దారితప్పిన ట్వీట్: మిస్ వరల్డ్ మానుషిపై శశిథరూర్ 'చిల్లర' వ్యాఖ్యలు

బీజేపీని టార్గెట్ చేయబోయి
శశిథరూర్ తన ట్వీట్ ద్వారా బీజేపీని టార్గెట్ చేయాలనుకున్నారు. కానీ ఆయన తప్పులో కాలేశారు. తన ట్వీట్ ద్వారా బీజేపీని టార్గెట్ చేయబోయి మానుషీ చిల్లర్ పైన అనుచితంగా ప్రవర్తించారు. అది ఆయన అనుకోనిది. ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.

మానుషీ చిల్లర్ ధీటైన సమాధానం
దీంతో మానుషీ చిల్లర్ ధీటుగా, హుందాగా స్పందించారు. చిల్లర్‌పై ఈ చర్చ ఓ చిన్న మార్పు మాత్రమేనని, చిల్లర్‌లో 'చిల్' ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయం వెల్లడించారు.

శశిథరూర్ క్షమాపణ
ఇది వివాదాస్పదం కావడంతో శశిథరూర్ వివరణ కూడా ఇచ్చారు. అది ఛలోక్తి మాత్రమేనని, మానుషీని తక్కువ చేసేందుకు తాను ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. దీనిపై క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.

శశిథరూర్ ట్వీట్
కాగా, కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై విమర్శలు గుప్పిస్తూ శశిథరూర్ ఈ చిల్లర్ పదాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే. 'పెద్దనోట్లను రద్దు చేయడం ఎంత తప్పు..! భారత కరెన్సీ ప్రపంచాన్ని డామినేట్ చేస్తుందని బీజేపీ గుర్తించాలి. మన చిల్లర్ ప్రపంచ సుందరి అయ్యింది' అని థరూర్ ట్వీట్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications