బీజేపీ పైకి దారితప్పిన ట్వీట్: మిస్ వరల్డ్ మానుషిపై శశిథరూర్ 'చిల్లర' వ్యాఖ్యలు

పదిహేడేళ్ల తర్వాత భారత దేశానికి మిస్ వరల్డ్ కిరీటం అందించిన మానుషీ చిల్లార్ పైన కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Recommended Video

    Miss World 2017 Manushi Chhillar : మిస్ వరల్డ్ పై 'చిల్లర' వ్యాఖ్యలు | Oneindia Telugu

    న్యూఢిల్లీ: పదిహేడేళ్ల తర్వాత భారత దేశానికి మిస్ వరల్డ్ కిరీటం అందించిన మానుషీ చిల్లార్ పైన కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

    చదవండి: 17ఏళ్ల తర్వాత: భారత అమ్మాయికి మిస్ వరల్డ్ కిరీటం

    శశిథరూర్ వివాదాస్పద ట్వీట్

    శశిథరూర్ వివాదాస్పద ట్వీట్

    మన కరెన్సీని రద్దు చేయడం ఎంత పెద్ద తప్పో బీజేపీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని, మన చిల్లరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చిల్లర్ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైందని వివాదానికి తావిచ్చే ట్వీట్ చేశారు.

    శశిథరూర్ చిల్లర వ్యాఖ్యలు

    శశిథరూర్ చిల్లర వ్యాఖ్యలు

    ఇన్నేళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకు వస్తే మానుషీ చిల్లార్‌ను చిల్లరతో పోల్చడం సరికాదని శశిథరూర్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి ఆయన చిల్లర వ్యాఖ్యలకు నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు.

    క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్ ఆగ్రహం

    క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్ ఆగ్రహం

    శశిథరూర్ వ్యాఖ్యల పైన జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషీ ఘనతను తక్కువ చేసి చూపినందుకు క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. నటుడు అనుపమ్ ఖేర్ కూడా థరూర్ పైన విమర్శలు గుప్పించారు.

    శశిథరూర్ పైన జాట్ల ఆగ్రహం

    శశిథరూర్ పైన జాట్ల ఆగ్రహం

    మరోవైపు, శశిథరూర్ వ్యాఖ్యల పైన జాట్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. మానుషీ చిల్లార్ జాట్ వర్గానికి చెందినవారు. ఆమెను అవమానించడం అంటే జాట్‌లను అవమానించడమేనని ఆ వర్గానికి చెందిన వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాట్ కమ్యూనిటీ ధైర్యం గలది అని, వారి పట్ల అనుచితంగా మాట్లాడవద్దని, మీరు థరూర్ అని, థోర్ కాదని అనుజ్ త్రవేది అనే ట్విట్టర్ పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+