17ఏళ్ల తర్వాత: భారత అమ్మాయికి మిస్ వరల్డ్ కిరీటం
Recommended Video

న్యూఢిల్లీ/బీజింగ్: ప్రపంచ సుందరిగా భారతీయ యువతి మానుషి చిల్లార్ విజయం సాధించి కిరీటం సొంతం చేసుకుంది. చైనాలోని సన్యా సిటీ ఎరీనా ప్రాంతంలో జరిగిన 67వ మిస్ వరల్డ్ పోటీల్లో పలు దేశాలకు చెందిన 118 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు.

అదరగొట్టిన హర్యానా సుందరి
హర్యానాకు చెందిన 21ఏళ్ల ఈ వైద్య విద్యార్థిని చిల్లార్ గ్రాండ్ ఫైనల్‌లో అందరినీ వెనక్కి నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలను శనివారం నిర్వహించారు.

17ఏళ్ల తర్వాత మళ్లీ..
2000లో బాలీవుడ్ నటి ప్రియాంకాచోప్రా మిస్‌వరల్డ్‌గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు 17ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని భారత్‌కు చెందిన చిల్లార్ దక్కించుకుంది

చిన్ననాటి కల
మిస్ వరల్డ్‌గా ఎంపికవడం అనేది తన చిన్ననాటి కల అని మానుషి ఈ సందర్భంగా పేర్కొంది. విజేతగా ఎంపికవడం అనేది ఒక ప్రయాణమని.. దాన్ని తానెప్పుడు మరచిపోనన్నారు. ఈ ప్రయాణంలో తానెంతో నేర్చుకున్నానని.. ఎంతో సంతోషం పొందినా.. ఫలితాన్ని మాత్రం విధికి వదిలేసినట్లు తెలిపింది.

రన్నరప్‌లుగా వీరే..
ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన స్టీఫెనీ హిల్ నిలిచింది. కాగా, అందరిని వెనక్కినెట్టి విజేతగా నిలిచిన మానుషి చిల్లార్‌కు మిస్ వరల్డ్-2016 విన్నర్ స్టెఫానే డెల్‌వాలే కిరీటాన్ని బహుకరించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications