వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై ఎయిర్‌పోర్టులో నోట్: 10న ఇస్లామిక్ స్టేట్ దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై విమానాశ్రయం గోడకు అతికించిన ఓ నోట్‌తో భద్రతా బలగాలు అప్రమత్తయ్యాయి. ఆ నోట్ చేతితో రాసి ఉంది. ఈ నెల 10వ తేదీన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చుననే సంకేతాలను అది అందించినట్లు చెబుతున్నారు. ఆ నోట్ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్ లెవల్ 2ోబతీ టాయిలెట్లో ఆ నోట్ లభించింది.

ఆ నోట్‌లో "ATTECK BY ISIS DATE 10/01/15 (sic)". అని రాసి ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. విమానాశ్రయం భద్రతను పర్యవేక్షించే సిఐఎస్ఎఫ్ సిసిటివీ ఫుటేజీలను పరిశీలిస్తోంది. ఆ నోట్ అతికించిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తోంది.

Note found at Mumbai airport: 'ISIS will attack on Jan 10'

అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. టెర్మినల్ లెవల్ 2 లోనికి ప్రవేశించే దారి. విమానంలో వచ్చిన వ్యక్తి ఒకరు ఆ నోట్‌ను పెట్టి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ నోట్‌ను సిఐఎస్ఎఫ్ అధికారులు మంగళవారం సాయంత్రం కనిపెట్టి ముంబై పోలీసులకు సమాచారం అందించారు.

గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో పెట్టుకుని నగర పోలీసులు గస్తీని, నిఘాను పటిష్టం చేసిన నేపథ్యంలో ఆ నోట్ వ్యవహారం చోటు చేసుకుంది. ముంబై సమీపంలోని థానేకు చెందిన నలుగురు భారత యువకులు ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన కారణంగా పోలీసులు సిఐఎస్ఎఫ్ ఆ నోట్‌ విషయంలో ఆందోళనకు గురవుతోంది. ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులు నగరంలో చురుగ్గా ఉండవచ్చుననేది అధికారుల అనుమానం.

English summary
Security agencies were alerted on Wednesday after a hand written note scribbled on a wall inside the Mumbai airport threatened of an impending attack by the ISIS on January 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X