రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు డిస్పోజ్
న్యూఢిల్లీ: డీఆర్ డీవో భవన్ కు నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి డీఆర్ డీవో భవన్ ఆవరణం నుంచి ఓ శక్తివంతమైన బాంబును అక్కడి సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఆ బాంబును తమ సిబ్బంది డిస్పోజ్ చేశారని జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్ జీ) చీఫ్ ఆర్.సి.తయాల్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బాంబును డిస్పోజ్ చేయడం వేరే ఏ ఏజెన్సీకి సాధ్యం కాలేదని చెప్పారు.

చివరికి తమ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి బాంబును డిస్పోజ్ చేశారని అన్నారు. ఏప్రిల్ 14వ తేదిన డీఆర్ డీవో భవన్ ఆవరణంలో కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న సమయంలో ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. డిస్పోజ్ చేసిన బాంబు రెండో ప్రపంచ యుద్దం నాటిదని తేలిందని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications