నుపుర్ కామెంట్ల చిచ్చు-ఢిల్లీ జామా మసీదు సహా కోల్ కతా, యూపీల్లో ముస్లింల నిరసనలు
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ఇవాళ ఢిల్లీ జామా మసీదు సహా పలు చోట్ల ముస్లింలు నిరసన తెలిపారు. శుక్రవారం ప్రార్ధనలు ముగిశాక మసీదుల బయటికి వచ్చి నుపుర్ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రపంచ దేశాల్లో ఆగ్రహానికి దారితీసిన మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ, కోల్‌కతా, ప్రయాగ్‌రాజ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో భారీ నిరసనలు చెలరేగాయి. ఢిల్లీలో శుక్రవారం ప్రార్థనల తర్వాత జామా మసీదు వెలుపల నిరసన చెలరేగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బిజెపి నుండి సస్పెండ్ అయిన నూపుర్ శర్మను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ముస్లింలు నిరసనకు దిగారు.

నూపుర్ శర్మతో పాటు సస్పెండైన నవీన్ జిందాల్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. జామా మసీదు షాహీ ఇమామ్ మాట్లాడుతూ.. తాము ఎలాంటి నిరసనకు పిలుపు లేదని పేర్కొన్నారు.
నిరసనలు చేస్తున్న వారు ఎవరో తమకు తెలియదని, వారు ఏఐఎంఐఎంకు చెందినవారని లేదా ఒవైసీ వర్గానికి చెందిన వారని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. వారు నిరసనలు చేయాలనుకుంటే వారు చేయగలరని, కానీ వారికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కోల్‌కతాలో నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు మొదలైన వాటితో నమాజ్ సందర్భంగా 300 మందికి పైగా ప్రజలు వచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లో కూడా రాళ్లదాడి జరిగిన ప్రాంతంలో నిరసనలు చెలరేగాయి. మొరాదాబాద్‌లో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.జార్ఖండ్ రాజధాని రాంచీలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో కొందరు పోలీసులు గాయపడ్డారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications