Nupur Sharma : గన్ లైసెన్స్ తీసుకున్న నుపుర్ శర్మ- బెదిరింపులొస్తున్నాయంటూ..
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన మాజీ నేత నుపుర్ శర్మకు ఈ మధ్య బెదిరింపులు మరీ తీవ్రమైనట్లు తెలుస్తోంది. నుపుర్ శర్మను చంపేస్తామంటూ ఎక్కడెక్కడి నుంచో ఆమెకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కోర్టులు, పోలీసుల నుంచి ఆమెకు ఊరట లభించినా బెదిరింపులు ఎక్కువ కావడంతో తాజాగా ఆమె గన్ లైసెన్స్ తీసుకున్నారు.
తనకు ఎదురవుతున్న బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల్ని ఆశ్రయించిన నుపుర్ శర్మ తనకు ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. దీంతో ఆమె అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు గన్ లైసెన్స్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గన్ ను తనతో పాటు ఉంచుకోనున్నారు. అయితే గన్ తీసుకున్నాక అయినా ఆమెకు బెదిరింపులు తగ్గుతాయో లేదో చూడాల్సి ఉంది.

గతేడాది ఓ టెలివిజన్ ఛానల్లో మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యల తర్వాత అంతర్జాతీయంగా పలు దేశాలు భారత్ పై విమర్శలు ఎక్కుపెట్టాయి. చివరికి ఆమె క్షమాపణలు చెప్పినా పరిస్దితి సద్దమణగలేదు. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది. అలాగే కోర్టుల్లోనూ ఆమెపై చర్యలు కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిపై విచారణ కొనసాగుతుండగానే బెదిరింపులు కూడా పెరిగాయి. దీంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించి గన్ లైసెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications