Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nusrat Jahan : మగబిడ్డకు జన్మనిచ్చిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్-వెంట యశ్ దాస్ గుప్తా-మాజీ భర్త రియాక్షన్...

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ,నటి నుస్రత్ జహాన్ గురువారం(ఆగస్టు 26) మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కోల్‌కతాలోని నియోషియా ఆస్పత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ఆస్పత్రిలో నుస్రత్ జహాన్ వెంట బెంగాల్ నటుడు యశ్ దాస్ గుప్తా ఉన్నారు. దాస్ గుప్తానే నుస్రత్ జహాన్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారు.

నుస్రత్ జహాన్ బిడ్డకు జన్మనివ్వడంపై ఆమె మాజీ భర్త నిఖిల్ జైన్ సోషల్ మీడియాలో స్పందించారు.'మా మధ్య బేధాభిప్రాయాలు ఉండొచ్చు. అయినప్పటికీ,తల్లి అయిన ఆమెకు,బిడ్డకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.' అని పేర్కొన్నారు.

నటి,రాజకీయ నాయకురాలు మిమీ చక్రవర్తి కూడా సోషల్ మీడియాలో స్పందించారు. తల్లి అయిన నుస్రత్ జహాన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

నుస్రత్ జహాన్,నిఖిల్ జైన్ 2019లో టర్కీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత ఏడాదికే ఈ జంట విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోకపోయినప్పటికీ ఎవరి దారి వారు చూసుకున్నారు. భారతీయ చట్టాల ప్రకారం తమ పెళ్లి చెల్లుబాటు కాదని గతంలో నుస్రత్ జహాన్ పేర్కొన్నారు. అంతేకాదు,తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతాల్లోని డబ్బును వాడుకున్నారని నిఖిల్ జైన్‌పై ఆరోపణలు చేశారు.

nusrat jahan blessed with baby boy yash das gupta with her at kolkata hospital

'మేమిద్దరం విడిపోయి చాలా కాలమే అవుతుంది. అయితే ఇది నా వ్యక్తిగత జీవితం కాబట్టి... దీన్ని బయటపెట్టాలని నేననుకోలేదు.' అని గతంలో నుస్రత్ పేర్కొన్నారు. నిఖిల్ జైన్‌తో విడిపోయాక కూడా తన బ్యాంకు ఖాతాల్లోని డబ్బును అతను వాడుకున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం నుస్రత్ జహాన్ యశ్ దాస్ గుప్తాతో సహజీవనం చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నుస్రత్ వెంట యశ్ దాస్ గుప్తా ఆస్పత్రికి రావడం,ఆమె వెంటే ఉండి చూసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

నుస్రత్ జహాన్ బెంగాలీ ముస్లిం కుటుంబంలో 1990లో జన్మించారు. 2011 నుంచి ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకూ 20 పైచిలుకు చిత్రాల్లో నటించారు. 2019లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నుస్రత్ జహాన్... బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. దాదాపు 3,50,000 వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+