వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా పర్యటన: ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జనవరి 27న పర్యాటకులకు తాజ్ మహల్ సందర్శనను నిలిపివేయనున్నారు. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన భారత్‌ పర్యటనలో జనవరి 27న తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు.

రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు ప్రత్యేక అతిథిగా బరాక్ ఒబామా వస్తుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా కనీవినీ ఎరుగని భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఆగ్రాలో భారీగా భద్రతా దళాలను మోహరించారు. ప్రత్యేకించి సీసీ టీవి కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఒబామా పర్యటన నేపథ్యంలో ఆగ్రా మొత్తం సీఏఎస్ఎఫ్ బలగాల చేతిలోకి వెళ్ళింది. తాజ్ మహల్ ఉండే ప్రాంతంలో స్పెషల్ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు వస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడు కూడా బరాక్ ఒబామానే కావడం విశేషం. అంతేకాకుండా జనవరి 26న రాజ్‌పథ్, ఇండియా గేట్‌ల వద్ద కూడా సందర్శకులను అనుమతించరు.

ఇక రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలు జరగనున్న రాజ్‌పథ్ మార్గంలో గగన తలాన్ని ప్రత్యేక రాడార్‌తో పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అమెరికా సిబ్బంది ఢిల్లీ, ఆగ్రాలో సెక్యూరిటీ ఏర్పాట్లను చూస్తున్నారు. రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్‌ డే దినోత్సవ వేడుకలలో పాల్గొంటున్న ఒబామా రెండు గంటల కంటే ఎక్కువ సేపు బహిరంగ వేదికపై ఉంటారు.

 ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత

ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత

జనవరి 27న పర్యాటకులకు తాజ్ మహల్ సందర్శనను నిలిపివేయనున్నారు. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన భారత్‌ పర్యటనలో జనవరి 27న తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు.

 ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత

ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత

రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు ప్రత్యేక అతిథిగా బరాక్ ఒబామా వస్తుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా కనీవినీ ఎరుగని భద్రతా చర్యలు చేపడుతున్నారు.

 ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత

ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత

ప్రత్యేకించి సీసీ టీవి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒబామా పర్యటన నేపథ్యంలో ఆగ్రా మొత్తం సీఏఎస్ఎఫ్ బలగాల చేతిలోకి వెళ్ళింది. తాజ్ మహల్ ఉండే ప్రాంతంలో స్పెషల్ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు.

 ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత

ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత

రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు వస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడు కూడా బరాక్ ఒబామానే కావడం విశేషం. అంతేకాకుండా జనవరి 26న రాజ్‌పథ్, ఇండియా గేట్‌ల వద్ద కూడా సందర్శకులను అనుమతించరు.

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనలో మొత్తం 15,000 కొత్త సీసీటీవీ కెమెరాలను దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. వీటిలో 100 కెమెరాలు ముఖాలను గుర్తిస్తాయి. వీటిలో ఉగ్రవాదులు, అనుమానితుల ఫొటోలు ఫీడ్‌ చేసి ఉంటాయి. ఆ ముఖాలను పోలినవి కనబడితే.. సెక్యూరిటీ సిబ్బందికి ఇవి సంకేతాలిస్తాయి.

ఈ వేదికపైకి వచ్చే సమయంలో ఒబామా తన అధికార బుల్లెట్ ప్రూఫ్ వాహనం 'బీస్ట్'లో రాకుండా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వాహనంలో వస్తే అది కూడా ఒక రికార్డ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో వీవీఐపీలు కూర్చునే ప్రాంతమంతా ఏడు అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఒబామా భద్రతపై అమెరికా, భారత నిఘా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

English summary
Taj Mahal will be shut for public on January 27 in view of US President Barack Obama's visit to Agra. Heavy security forces have been deployed in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X