Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Naveen PatnaiK: అనారోగ్యం వార్తలపై నవీన్ పట్నాయక్ క్లారిటీ-మోడీ కామెంట్స్ పై స్పందన..!

ఎప్పుడూ కూల్ గా కనిపించే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇవాళ తన సహజ శైలికి భిన్నంగా ప్రధాని మోడీపై పైర్ అయ్యారు. ఒడిశాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తన ఆరోగ్యంపై అనుమానాలు కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై నవీన్ మండిపడ్డారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ స్పందించారు. తన ఆరోగ్యంపైనా క్లారిటీ ఇచ్చారు.

ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రధాని మోడీ ప్రకటనపై ఆయన స్పందించారు. ప్రధాని ఓ బహిరంగ సభలో తన ఆరోగ్యం బాగోలేదని, దీనిపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఆయన తన ఆరోగ్యంపై అంతలా ఆందోళన చెందుతుంటే ఫోన్ కాల్ చేసి ఉండాల్సిందంటూ చురకలు అంటించారు. దానికి బదులు తాను అనారోగ్యంగా ఉన్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు.

odisha cm Naveen PatnaiK clarified to pm modi s comments over his health ask why not call me

పదేళ్లుగా తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, గత నెల రోజులుగా తన సొంత రాష్ట్రంలో ప్రచారం కూడా చేస్తున్నాను అని ప్రధాని మోడీకి నవీన్ పట్నాయక్ గుర్తుచేశారు. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం ఇప్పటికే పాతికేళ్లుగా అధికారంలో ఉంది. మరోసారి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ అనారోగ్యంగా ఉన్నారని, దీనిపై పూర్తి వివరాలు బయటికి రావడం లేదని, దీనిపై విచారణ చేయిస్తామంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. వయోవృద్ధుడైన నవీన్ పట్నాయక్ ఇక పాలించలేరని, ఈసారి తమను ఎన్నుకోవాలని మోడీ ఓటర్లను కోరారు. దీనిపై నవీన్ ఫైర్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+