VK Pandian: నవీన్ పట్నాయక్ వారసుడొచ్చాడు ? బీజేడీలో చేరిన వీకే పాండ్యన్..
ఒడిశా రాజకీయాల్లో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే వయోభారంతో ఇబ్బంది పడుతున్న సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా భావిస్తున్న సెక్రటరీ వీకే పాండ్యన్ ఇవాళ అనూహ్యంగా అధికార పార్టీ బీజేడీలో చేరిపోయారు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉంటూ వీఆర్ఎస్ తీసుకుని నవీన్ వ్యక్తిగత కార్యదర్శిగా చేరిన పాండ్యన్ నెలల వ్యవధిలోనే బీజేడీలో చేరిపోవడం విశేషం. దీంతో త్వరలో నవీన్ ఆయన్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించే అవకాశముంది.
Glad to welcome Shri VK Pandian to @bjd_odisha. He has been working very hard for several years for the people of #Odisha and earned their respect & trust. I am sure Shri Pandian will continue to do so in the future as a member of the party. Wish him all the very best. pic.twitter.com/Aoj49FXyTp
— Naveen Patnaik (@Naveen_Odisha) November 27, 2023
2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వీకే పాండ్యన్.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేడీ సీనియర్ నేతల సమక్షంలో పార్టీలో చేరారు. 2011 నుండి 12 సంవత్సరాల పాటు పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న పాండ్యన్ సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ కు నమ్మకస్తుడిగా కూడా ఉన్నారు. తాజాగా ఆయన వీఆర్ఎస్ తీసుకుని నవీన్ వ్యక్తిగత కార్యదర్శిగా మారారు. అక్కడి నుంచి బీజేడీలో చేరారు.

ఈ ఏడాది అక్టోబరు 23న ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన పాండ్యన్ ను నవీన్.... ఆ తర్వాత నేరుగా తన క్రింద పనిచేయడానికి క్యాబినెట్ మంత్రి హోదాలో రాష్ట్ర ప్రధాన 5టీ-'నవీన్ ఒడిశా' పథకానికి ఛైర్మన్‌గా నియమించారు.ఇప్పుడు ఏకంగా బీజేడీలో చేరిపోవడంతో పట్నాయక్.. తన పార్టీ శ్రేణులకు కీలక సందేశం పంపినట్లయింది. వాస్తవానికి బీజేడీలో నవీన్ తర్వాత ఎవరన్న సందేహాలు నెలకొన్న తరుణంలో పాండ్యన్ భవిష్యత్ ఆశాకిరణంగా మారారు.
ସଭାପତି ତଥା ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ @Naveen_Odisha ଙ୍କ ଦୃଢ଼ ନେତୃତ୍ବରେ ଲୋକଙ୍କ କଲ୍ୟାଣ ତଥା ରାଜ୍ୟରେ ରୂପାନ୍ତରଣ କାର୍ଯ୍ୟକୁ ଆହୁରି ତ୍ୱରାନ୍ୱିତ କରିବା ଲକ୍ଷ୍ୟ ନେଇ #5T ଏବଂ ନବୀନ ଓଡ଼ିଶା ଅଧ୍ୟକ୍ଷ ଶ୍ରୀ ଭି.କେ ପାଣ୍ଡିଆନ୍ ବିଜୁ ଜନତା ଦଳରେ ଯୋଗ ଦେଇଛନ୍ତି। ଶ୍ରୀ ଭି.କେ ପାଣ୍ଡିଆନଙ୍କ ଏହି ଯୋଗଦାନ ସାଧାରଣ ଲୋକଙ୍କ ହକ୍,… pic.twitter.com/RQWgQRvP3C
— Biju Janata Dal (@bjd_odisha) November 27, 2023
అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పాండ్యన్ బీజేడీలో చేరికను వ్యతిరేకించాయి. పట్నాయక్ ప్రభుత్వాన్ని ఒక బ్యూరోక్రాట్‌కు "అవుట్‌సోర్స్" చేశారని విమర్శించాయి. దీనికి వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
ముఖ్యమంత్రి సన్నిహితుడిగా ఉన్న పాండ్యన్.. రాజకీయ ప్రయోజనాల కోసం తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడంతో గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications