మ్యాచ్ ఆడుతూ కుప్పకూలిన పోలీస్ క్రీడాకారుడు
భువనేశ్వర్: ఒరిస్సాలో మ్యాచ్ ఆడుతూ ఓ పోలీసు క్రీడాకారుడు మృతి చెందిన విషాద సంఘటన జరిగింది.బ్రహ్మపురలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ సదరు పోలీసు క్రీడాకారుడు చనిపోయారు.
ఆదివారం సాయంత్రం బ్రహ్మపుర క్రీడా మైదానంలో బ్రహ్మపుర పోలీస్, నటరాజ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య జిల్లా ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ప్రథమార్ధంలో బ్రహ్మపుర జట్టు ముందంజలో నిలిచింది.

ద్వితీయార్ధం ప్రారంభమైన పది నిమిషాలకే ఈ జట్టు క్రీడాకారుడు అరుణ్ కుమార్ సాహూ మైదానంలో కుప్పకూలిపోయారు. వెంటనే నిర్వాహకులు, తోటి క్రీడాకారులు అతనిని ఆస్పత్రికి తరలించారు.
అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొద్దిసేపటి ముందే అరుణ్‌తో కరచాలనం చేసి అభినందించి వచ్చానని, ఇంతలో అంత ఘోరం జరిగిందని డీఐజీ అమితాబ్ ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.












Click it and Unblock the Notifications