వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో.. అలా జరగడం బాదాకరం..! జెట్ ఎయిర్ వేస్ పై విజయ్ మాల్య ఆవేదన..!!

|
Google Oneindia TeluguNews

లండన్/హైదరాబాద్ : జెట్ ఎయిర్ వేస్ రోజు రోజుకు మరింత దిగజారుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు జెట్ ప్రస్తుతం తన అంతర్జాతీయ సర్వీసులను కూడా నిలిపివేసింది. రుణ సంక్షోభంలో కూరుకుపోయి మూసివేత దిశగా అడుగులు వేస్తున్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ దీన పరిస్థితిపై విజయ్‌ మాల్యా విచారం వ్యక్తం చేశారు.

జెట్‌ పరిస్థితికి కేంద్రప్రభుత్వమే కారణమంటూ ఆయన ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశారు. అంతేకాదు ప్రయివేటు సంస్థలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆయన విమర్శించారు. భారత ప్రభుత్వం చొరవ చూపిస్తే జెట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యనుండి గట్టెక్కడం పెద్ద సమస్య కాదని మాల్య చెప్పుకొస్తున్నారు.

Oh..its bothering.! Vijay Mallya wonders on Jet Airways..!!

అంతేకాదు ఒకప్పుడు కింగ్‌ఫిషర్‌కు జెట్‌ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. అంత పెద్ద ప్రైవేటు ఎయిర్‌లైన్‌ను నేడు ఈ స్థితిలో చూడాల్సి రావడం బాధాకరమని ఆయన పేర్కోన్నారు. కింగ్‌ఫిషర్‌లో నేను భారీ పెట్టుబడులు పెట్టాను. కొద్ది కాలంలో ఎయిర్‌లైన్‌ వేగంగా అభివృద్ధి చెంది దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగి..

ఎన్నో అవార్డులను తెచ్చుకుందని ఆయన తెలిపారు. అంతేకాదు తాను బ్యాంకు రుణాలు చెల్లిస్తాను..కాని నేను ఈ మాట చెప్పినప్పుడల్లా మీడియా నన్ను భారత్‌కు అప్పగించే విషయం గురించి మాట్లాడుతోందని ఆయన మరోసారి అన్నారు. నేను లండన్‌లో ఉన్నా.. భారత జైల్లో ఉన్నా రుణాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా. అయినా బ్యాంకులు ఎందుకు తీసుకోవట్లేదు? అని మాల్యా చెప్పుకొచ్చారు.

English summary
Vijay Mallya has expressed regret over Jet Airways's condition. He is accused of causing a jet situation as a Twitter platform. He also criticized the Center for discrimination against private companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X