పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయ్: ఎప్పుడూ లేనంత భారీ పెంపు: తొలిరోజే మైండ్ బ్లాక్
న్యూఢిల్లీ: ఊహించినట్టే- పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆరంభమైంది. ఇక పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. అనూహ్య పెరుగుదల కనిపించవచ్చు. వాహనదారులకు తొలి రోజే భారీగా షాక్ ఇచ్చాయి చమురు సంస్థలు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేనివిధంగా లీటర్ రేటును భారీగా పెంచేశాయి. బల్క్ డీజిల్ విక్రయాల మీద లీటర్ ఒక్కింటికి 25 రూపాయల మేర పెంచిన రెండో రోజే రిటైల్ అమ్మకాల మీద పడ్డాయి ఆయిల్ కంపెనీలు.

లీటర్‌పై 80 పైసలు పెంపు..
లీటర్ ఒక్కింటికి పెట్రోల్, డీజిల్ మీద 80 పైసలను పెంచేశాయి. 137 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారిగా ఇంధన ధరలు పెరగడం ఇదే తొలిసారి. లీటర్‌పై 80 పైసల పెంపు ఇదివరకు ఎప్పుడూ లేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 27 రోజులుగా కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఒకదశలో బ్యారెల్ రేటు 140 డాలర్లను దాటిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. బ్యారెల్ రేటు 110 డాలర్లకు అటు ఇటుగా ఉంటోంది.

వివిధ నగరాల్లో ఇలా..
క్రూడాయిల్ రేటు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకడం వల్ల తలెత్తిన అదనపు భారాన్ని చమురు సంస్థలు వాహనదారులపై మోపాయి. పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.21 పైసలకు చేరింది. డీజిల్ రూ.87.47 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ110.82 పైసలు, డీజిల్ రూ.95.51 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.105.51 పైసలు, డీజిల్ రూ.90.62 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.16 పైసలు, డీజిల్ 92.19 పైసలకు చేరింది.

137 రోజుల తరువాత తొలిసారిగా..
137 రోజుల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. గత సంవత్సరంలో ఇంధన ధరలు రోజుల తరబడి పెరిగాయి. 70 నుంచి 75 రూపాయలుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర. 110 రూపాయల వరకు చేరిందంటే- ఈ పెరుగుదల వేగాన్ని, తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చివరిసారిగా గత సంవత్సరం నవంబర్ 2వ తేదీన వాటి రేట్లను పెంచాయి ఆయిల్ కంపెనీలు. నవంబర్‌లో దీపావళి పండగ కానుకగా కేంద్ర ప్రభుత్వం- ఇంధన ధరల పెరుగుదలకు పుల్‌స్టాప్ పెట్టింది.

అప్పట్లో తగ్గినా..
పైగా పెట్రోల్‌పై అయిదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ పరిధిలో ఇంధన ధరలను తగ్గించాయి. వాటి అమ్మకాలపై వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు దీనికి మినహాయింపు. దీని తరువాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకడం ఇదే తొలిసారి.

యుద్ధం ఎఫెక్ట్..
యుద్ధం ఆరంభం కావడానికి ముందు రోజులతో పోల్చుకుంటే- ఈ రేటూ చాలా ఎక్కువ. 40 శాతం క్రూడాయిల్ ధర పైకి ఎగబాకింది. పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం భారత్‌పైనా పడింది. దేశీయ చమురు కంపెనీలు డీజిల్‌పై అధిక భారాన్ని ఇప్పటికే మోపాయి. వాటి ధరను అమాంతం పెంచాయి. డీజిల్‌పై లీటర్ ఒక్కింటికి 25 రూపాయల అదనపు భారాన్ని మోపాయి. ప్రస్తుతానికి ఈ పెంపు బల్క్ అమ్మకాలకు మాత్రమే వర్తింపజేశాయి.

రిటైల్ అమ్మకాలపై..
ఈ పెంపుదల రిటైల్ డీజిల్ అమ్మకాలకూ వర్తింపు కాబోదనే గ్యారంటీ లేదనే అభిప్రాయాలు వెలువడిన రెండో రోజే దాన్ని నిజం చేశాయి చమురు సంస్థలు. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ బాదుడును మొదలు పెట్టాయి. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చు. గత సంవత్సరం ఇంధన ధరల పెరుగుదల తీరును గమనిస్తే- గుండె గుభేల్ మనడం ఖాయం. మళ్లీ అప్పట్లా వాటి రేట్లు ఇక దినదినాభివృద్ధిమస్తు అన్నట్లుగా ఎగబాకే అవకాశాలు లేకపోలేదు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications