Oil Prices : మళ్లీ చమురు ధరల మంట ? సౌదీ, రష్యా కోతల ఎఫెక్ట్..!
చమురు ధరలు మరోసారి మంటపుట్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాలతో చమురు ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, రష్యా విధిస్తున్న సరఫరా కోతలతో భారత్ సహా పలు దేశాల్లో చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 2 శాతం మేర పెరిగాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే చమురు మంట ప్రభావం భారత్ పైనా తీవ్రంగా పడే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.
వచ్చే నెల వరకూ చమురు సరఫరాలో కోతలు విధించాలని సౌదీ అరేబియా, రష్యా తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయంగా వీటి ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతానికి సెప్టెంబర్ వరకూ చమురు సరఫరా ఆంక్షలు కొనసాగించాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. అయితే ఆ తర్వాత కూడా ఇదే పరిస్దితి కొనసాగవచ్చని అంతర్జాతీయంగా పలు దేశాలు భావిస్తున్నాయి. దీంతో భారత్ పైనా ఈ ప్రభావం పడేలా కనిపిస్తోంది.

తాజాగా నిన్న ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 1.94 డాలర్లు పెరిగింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 2.06 డాలర్లు పెరిగింది. అయితే చివరికి 81.55 డాలర్ల వద్ద స్ధిరపడింది. ఇటీవల పెద్దగా ధరల్లో మార్పు లేకపోవడం వల్ల బ్రెంట్ చారిత్రాత్మక లేదా వాస్తవమైన 30-రోజుల క్లోజ్-టు-క్లోజ్ ఫ్యూచర్స్ అస్థిరత ఫిబ్రవరి 2022 నాటి కనిష్ట స్థాయికి మరింత తగ్గించింది.
ఇతర చమురు మార్కెట్‌లలో, యూఎస్ డీజిల్ ఫ్యూచర్‌లు జనవరి 2023 నుండి అత్యధికంగా 2% పెరిగాయి. సౌదీ అరేబియా సెప్టెంబరు వరకూ రోజుకు ఒక మిలియన్ బ్యారెల్స్ (బిపిడి) స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోతను పొడిగించనున్నట్లు తెలిపింది. దానిని అంతకు మించి పొడిగించవచ్చు లేదా కొనసాగించవచ్చని తెలుస్తోంది. సెప్టెంబరులో సౌదీ ఉత్పత్తి సుమారు 9 మిలియన్ బీపీడీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో రష్యా చమురు ఎగుమతులను 300,000 ీపీడీ తగ్గించనున్నట్లు ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు.
అయితే సౌదీ, రష్యా ఇలాగే తమ చమురు సరఫరాల్లో కోతలు విధిస్తూ పోతే మాత్రం భారత్ పై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుందని అంచనా వేస్తున్నారు. అసలే వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చమురు ధరలు పెరిగితే మాత్రం కేంద్రంలో అధికార బీజేపీతో పాటు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలపై ఒత్తిడి అంతకంతకూ పెరిగే అవకాశముంది. దీంతో అంతర్జాతీయంగా చముకరు ధరల్ని కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications