కర్ణాటకలో "ఓలా" కు బ్రేక్.. 6 నెలలు నిషేధం..!
బెంగళూరు : రవాణా రంగంలో దూసుకెళుతున్న ఓలా క్యాబ్ సర్వీస్ సంస్థకు పెద్ద షాక్ తగిలింది. కర్ణాటకలో ఆ సంస్థ సర్వీసులకు బ్రేక్ పడింది. ఓలా ట్యాక్సీలతో పాటు ఆటోలపై కర్ణాటక రవాణా శాఖ 6 నెలల పాటు నిషేధం విధించింది. ఎలాంటి అనుమతులు లేకుండా బైక్ ట్యాక్సీలు నడుపుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బైక్ ట్యాక్సీలపై కొరడా
బైక్ ట్యాక్సీలు నడపడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రవాణా శాఖ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఓలా సంస్థ బైక్ ట్యాక్సీలు యదేచ్ఛగా నడుపుతోంది. జనవరి నెల నుంచి బెంగళూరులోని కొన్ని ఏరియాల్లో బైక్ ట్యాక్సీలు నడుపుతోంది. దాంతో ఓలా సంస్థకు ఇదివరకే రవాణా శాఖ షోకాజ్ నోటీసులు కూడా జారీచేసింది.

బీటా పైలట్.. ఓలా వెర్షన్
అయితే ప్రజల నుంచి సమాచారం సేకరించడంలో భాగంగా బీటా పైలట్ ప్రాజెక్ట్ కింద బైక్ ట్యాక్సీలు నడుపుతున్నట్లు వివరణ ఇచ్చింది ఆ సంస్థ. ఓలా నిర్వాహకుల సమాధానంతో సంతృప్తి చెందని రవాణా శాఖ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. 6 నెలల పాటు ఓలా లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓలా సంస్థకు చెందిన ట్యాక్సీలు, ఆటోలు నడపకుండా నిషేధం విధించింది.

చట్టాలను అతిక్రమించం : ఓలా
కర్ణాటక రవాణా శాఖ తీరుపై ఓలా నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓలా పై నిషేధం విధించడంపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థపై 6 నెలల పాటు నిషేధమనేది దురుదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఓలా సంసిద్ధంగా ఉందని, అందులో భాగంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. చట్టాలకు అనుగుణంగానే ఓలా పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications