ఉగ్రదాడిని అందుకు వాడుకోను-సారీ చెప్పేందుకు మాటల్లేవు-ఒమర్ అబ్దుల్లా కామెంట్స్..!
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఇవాళ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని, భవిష్యత్తులో చోటు చేసుకోబోయే పరిణామాల్ని కూడా వెల్లడించారు. ఉగ్రదాడిపై దేశం ఏకమైందని, దీంతో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ముగింపు పడుతుందని భావిస్తున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రదాడిని అడ్డుపెట్టుకుని కేంద్రాన్ని రాష్ట్ర హోదా డిమాండ్ చేయలేనన్నారు.
దేశంలోని ప్రతి ప్రాంతం, ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు, ఈ దారుణమైన చర్యతో బాధపడిందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్ మొత్తం ఐక్యంగా ఉందని, ఇది లోయలో "ఉగ్రవాదం ముగింపుకు నాంది కావచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లాకూ, ప్రభుత్వానికి విపక్ష బీజేపీ నుంచి మద్దతు లభించింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రిని, ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్‌ను విపక్ష నేత సునీల్ శర్మ ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది బాధితుల పేర్లు, రాష్ట్రాలను సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో చదివి వినిపించారు. జమ్మూ కాశ్మీర్ ఇటువంటి దాడుల వెనుక ఉందని భారత దేశం మొత్తం భావించడం ప్రారంభించిందని సీఎం తెలిపారు. దురదృష్టవశాత్తు తదుపరి దాడి ఎక్కడ జరుగుతుందో అని అనిపించే పరిస్ధితిని ఇది కల్పించిందన్నారు. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పడానికి తనకు మాటలు లేవని అబ్దుల్లా గుర్తుచేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రత ఎన్నికైన ప్రభుత్వం కింద లేదని ఒమర్ గుర్తుచేశారు.
కానీ ముఖ్యమంత్రిగా, పర్యాటక మంత్రిగా, తను పర్యాటకుల్ని ఇక్కడికి స్వాగతించానని ఒమర్ తెలిపారు. వారిని తిరిగి సురక్షితంగా పంపడం తన బాధ్యతే అన్నారు. తాను అది చేయలేకపోయానన్నారు. క్షమాపణ చెప్పడానికి తన దగ్గర మాటలు లేవన్నారు. రక్తంతో తడిసిన తమ తండ్రులను చూసిన ఆ పిల్లలకు, రోజుల క్రితం వివాహం చేసుకున్న ఆ నేవీ అధికారి వితంతువుకు తానేం చెప్పగలనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారు తమ తప్పు ఏమిటని అడిగారని, వారు మొదటిసారి కాశ్మీర్‌కు వచ్చామని, ఆ సెలవుదినానికి జీవితాంతం మూల్యం అనుభవిస్తామని చెప్పారన్నారు.
#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, "... This incident affected the entire country. We have seen many such attacks in the past... An attack of such a large scale has been carried out after 21 years in Baisaran... I did not know how to apologise to the families of the… pic.twitter.com/lwkZe8BlzP
— ANI (@ANI) April 28, 2025
ఉగ్రదాడికి పాల్పడిన వారు కాశ్మీర్ కోసం దీన్ని చేశారని చెప్పుకున్నారని, కానీ వాళ్లను తాము ఇది అడిగామా అని సీఎం ఒమర్ ప్రశ్నించారు. ఈ 26 మందిని తమ పేరుతో శవపేటికలలో తిరిగి పంపాలని తాము చెప్పామా అని అడిగారు. తాము దీనికి అంగీకరించామా? అన్నారు. తమలో ఎవరూ ఈ దాడికి మద్దతు ఇవ్వడం లేని, ఈ దాడి తమను షాక్ కు గురిచేసిందన్నారు. రెండు దశాబ్దాలకు పైగా జమ్మూ కాశ్మీర్‌లో ఇంత పెద్ద ఎత్తున దాడికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావడం ఇదే తొలి అన్నారు. "కతువా నుండి కుప్వారా వరకు, దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయని పట్టణం లేదా గ్రామం లేదన్నారు.
ప్రజలు ప్రభుత్వాలకు అండగా ఉన్నప్పుడు ఉగ్రవాదం అంతమవుతుందని ఒమర్ తెలిపారు. ఇది ఒక అవకాశానికి నాంది అన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలని, ప్రజలను మన నుండి దూరం చేసే ఏ పని చేయకూడదని తెలిపారు. ఈ ఆకస్మిక నిరసనను దెబ్బతీసే ఎటువంటి చర్య తీసుకోకూడదన్నారు. తుపాకులతో మనం ఉగ్రవాదాన్ని నియంత్రించగలమని, కానీ దానిని అంతం చేయలేమన్నారు. ప్రజలు మనతో ఉన్నప్పుడు అది అంతం అవుతుందన్నారు.
VIDEO | Jammu and Kashmir CM Omar Abdullah (@OmarAbdullah) addresses special session of Assembly organised to condemn the Pahalgam terror attack.#PahalgamTerrorAttack
— Press Trust of India (@PTI_News) April 28, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/MQHFSw4N7q
ఒక పర్యాటకుడిని రక్షించడానికి ప్రయత్నించి ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన ధైర్యవంతుడైన గుర్రపు బండి నడిపే వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా గురించి ప్రస్తావిస్తూ,అందరూ తన ప్రాణాలకు భయపడుతున్నారని, కానీ అతను పర్యాటకుల కోసం, మన అతిథుల కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని ప్రశంసించారు. అతను పారిపోయి ఉంటే ఎవరు ప్రశ్నించేవారన్నారు. కానీ పారిపోయే బదులు, అతను ప్రమాదం వైపు వెళ్ళాడని, ఇలాంటి కథలు మనం చాలా వింటున్నామన్నారు.
ప్రజలు గాయపడిన వారిని తమ భుజాలపై మోసుకు వెళ్లారని, స్థానికులు పర్యాటకులకు సహాయం చేయడానికి ప్రయత్నించారని సీఎం ఒమర్ తెలిపారు. ఒక పేద శికారావల్లా ఉచిత పండ్ల చాట్‌ను అందించాడని, అతను రోజుకు 200-300 రూపాయలు సంపాదిస్తాడని గుర్తుచేశారు. క్యాబ్ ఆపరేటర్లు ఉచిత రైడ్‌లు అందించారని, హోటల్ యజమానులు వారి గదులను తెరిచారని, తాను వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. తాము ఇలాగే ఆతిథ్యం ఇస్తున్నామన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications