బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Omicron: మార్కెట్ లోకి కొత్త వైరస్, వ్యాక్సిన్ వెయ్యాలని, అత్తా, కోడలిని కట్టేసి, రివాల్వర్ తో ?, ఐటీ హబ్ లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (Coivd-19) మహమ్మారి దెబ్బతో ప్రజలు ఎంత భయపడ్డారో అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. కోవిడ్ వ్యాక్సిన్ మొదట వేయించుకోవడానికి వెనుకా ముందు ఆలోచించిన ప్రజలు తరువాత ప్రాణభయంతో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికే 100 కోట్ల మంది భారతీయులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని రికార్డు సృష్టించారు. ఇప్పుడు మార్కెట్ లోని కొత్తగా కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)వైరస్ రావడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఒమిక్రాన్ వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే కొత్త వ్యాక్సిన్ వేసుకోవాలని మాయమాటలు చెప్పిన కిలాడీలు అత్తా, కోడలిని రివాల్వర్ తో బెదిరించి భయాందోళనకు గురి చేసి ఇంట్లో ఉన్న బంగారు నగలు లూటీ చేశారు. ఐటీ హబ్ లో ఒమిక్రాన్ వ్యాక్సిన్ పేరుతో ఇల్లు లూటీ చెయ్యడానికి కిలాడీలు ఎలాంటి స్కెచ్ వేశారు అనే విషయం తెలుసుకున్న ప్రజలు, పోలీసులు షాక్ అయ్యారు.

Illegal affair: భార్య ముందే భర్త ఆంటీలతో వీడియో కాల్స్ చేసి ?, ఎదురు తిరిగితే ఏసేశాడు !Illegal affair: భార్య ముందే భర్త ఆంటీలతో వీడియో కాల్స్ చేసి ?, ఎదురు తిరిగితే ఏసేశాడు !

సంపత్ సింగ్

సంపత్ సింగ్

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని యశవంతపురంలోని బృందావననగర్ లో సంపత్ సింగ్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. సంపత్ సింగ్, ఆయన భార్య పిస్తా దేవి, కొడుకు విక్రమ్ సింగ్, కోడలు రక్షా ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. సంపత్ సింగ్, ఆయన కొడుకు విక్రమ్ సింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇంట్లో పిస్తా దేవి, ఆము కోడలు రక్షా ఉంటున్నారు.

 కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న ప్రజలు

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న ప్రజలు

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రజలు ఎంత భయపడ్డారో అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. కోవిడ్ వ్యాక్సిన్ మొదట వేయించుకోవడానికి వెనుకా ముందు ఆలోచించిన ప్రజలు తరువాత ప్రాణభయంతో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికీ బెంగళూరు నగరంలోని బీబీఎంపీ వార్డు కార్యాలయాల్లో కోవిడ్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఉచితంగా ప్రజలకు వేస్తున్నారు.

మార్కెట్ లోకి కొత్త వైరస్ ఒమిక్రాన్

మార్కెట్ లోకి కొత్త వైరస్ ఒమిక్రాన్

మార్కెట్ లోని కొత్తగా కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)వైరస్ రావడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్సోవానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయిల్ తో పాటు ఐరోపా దేశాల నుంచి భారత్ వస్తున్న ప్రయాణికులను క్వారంటైన్ లో పెట్టాలని అధికారులు ఇప్పటికే డిసైడ్ అయ్యారు.

ఒమిక్రాన్ వ్యాక్సిన్ వేస్తామని ?

ఒమిక్రాన్ వ్యాక్సిన్ వేస్తామని ?


యశవంతపురంలోని సంపత్ సింగ్ ఇంటికి కారులో ముగ్గురు నిందితులు వెళ్లారు. ఒ నిందితుడు చేతికి గ్లౌజ్ లు వేసుకుని, షర్టు మీద తెల్లటి కోట్ వేసుకుని ఆరోగ్య శాఖ ఉద్యోగిలా సంపత్ సింగ్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. ఆ సమయంలో సంపత్ సింగ్ భార్య పిస్తా దేవి ఇంటి తలుపులు తీసింది. మేము బీబీఎంపీ ఆఫీసు నుంచి వస్తున్నామని, మీరు కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. తరువాత మీకు ఒమిక్రాన్ వ్యాక్సిన్ వెయ్యాలని పిస్తా దేవికి ఓ నిందితుడు చెప్పాడు.

 రూమ్ లో కట్టేసి బంగారు నగలు లూటీ

రూమ్ లో కట్టేసి బంగారు నగలు లూటీ

పిస్తా దేవికి అనుమానం వచ్చి ఆమె భర్త సంపత్ సింగ్ కు ఫోన్ చెయ్యడానికి మొబైల్ ఫోన్ ఎత్తుకుంది. ఆ సమయంలో కారులో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఇంట్లోకి చోరబడి పిస్తా దేవి, ఆమె కోడలు రక్షాను రివాల్వర్ తో బెదిరించి బెడ్ రూమ్ లోకి తోసేసి వారిని కట్టేసి రూమ్ బయట లాక్ చేశారు. తరువాత ఇంట్లో ఉన్న బంగారు నగలు, చేతికి చిక్కన నగదు లూటీ చేసిన నిందితులు ఇంటి బయటకు వచ్చారు.

 కొడుక్కి మాయమాటలు చెప్పి ఎస్కేప్

కొడుక్కి మాయమాటలు చెప్పి ఎస్కేప్

అదే సమయంలో సంపత్ సింగ్ కొడుకు విక్రమ్ సింగ్ ఇంటి దగ్గరకు వెళ్లాడు. మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా ? అని నిందితులు అతన్ని ప్రశ్నించారు. మేము కోవిడ్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నామని విక్రమ్ సింగ్ నిందితులకు చెప్పారు. సరే మేము ఒమిక్రాన్ వ్యాక్సిన్ వెయ్యడానికి తరువాత వస్తాము అని చెప్పిన నిందితులు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.

కిలాడీల కోసం వేట

కిలాడీల కోసం వేట

ఇంటిలోపలికి వెళ్లిన విక్రమ్ సింగ్ బెడ్ రూమ్ తలుపులు తీసి తల్లి పిస్తా దేవి, భార్య రక్షాను బయటకు పిలుచుకుని వచ్చి జరిగిన విషయ తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒమిక్రాన్ వ్యాక్సిన్ వేసే ముసుగులో కారులో వచ్చిన నిందితులు రివాల్వర్ తో బెదిరించి ఇల్లు లూటీ చేశారని తెలుసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు.

English summary
Omicron: Miscreants entered a house in Bengaluru on the pretext of giving a jab for the new Omicron Covid variant and robbed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X