ట్రావెల్ హిస్టరీ లేకున్నా ఒమిక్రాన్.. అదీ కమ్యూనిటీ స్ప్రెడే: ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్
ఒమిక్రాన్ వేరియంట్ వెన్నులో వణుకు తెప్పిస్తోంది. ఇప్పటివరకు దేశంలో వెలుగుచూసిన కేసులు అన్నీ కూడా విదేశాల నుంచి వచ్చిన వారికే వచ్చాయి. అలా వారి నుంచి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కు కూడా సోకుతుంది. అయితే కొన్ని సందర్బాల్లో.. కొందరికీ వైరస్ నిర్ధారణ జరుగుతుంది. అయితే వారికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. దీంతో వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్ప్రెడ్ జరుగుతుందని ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కామెంట్ చేశారు.
విదేశాల నుంచి రానీవారికి ఒమిక్రాన్ నిర్ధారణ జరిగితే.. అదీ ముమ్మాటికీ కమ్యూనిటీ స్ప్రెడ్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ ముమ్మాటికీ సమాజంలో వ్యాప్తి చెందుతుందని వివరించారు. అంతేకాదు ఢిల్లీలో వచ్చిన ఒమిక్రాన్ కేసులు కరోనా కేసుల్లో 46 శాతం అని వివరించారు.

బుధవారం ఢిల్లీలో 923 కరోనా కేసులు వచ్చాయి. ఇదీ మే 30 తర్వాత ఇదే అధికంగా కేసులు రావడం అని రికార్డులు చెబుతున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలల తర్వాత పాజిటివిటీ రేటు 1 శాతం దాటింది. 1.29 శాతం వచ్చింది. డిసెంబర్ 20వ తేదీన 91 కేసులు వచ్చాయి. దీంతో కేసులు 923కి చేరాయి. అలాగే బుధవారం నాటికి ఒమిక్రాన్ కేసులు 238కి చేరాయి.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. అన్నీ రాష్ట్రాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించాయి. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కానీ కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications