దారుణం: టెక్కీ అంజలిని వెంటాడి కాల్చి చంపారు(వీడియో)
న్యూఢిల్లీ: ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైంది. తానుంటున్న అపార్ట్ మెంట్ బేస్ మెంట్ వద్ద ఆమెను దుండగులు వెంటాడి కాల్చి చంపేశారు. ఈ దారుణ ఘటన ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలు అంజలి రాథోర్(23) నోయిడాలోని ప్రముఖ మొబైల్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ 'లావా'లో ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. హర్యానాలోని యమునా విహార్‌కు చెందిన ఆమె ఉద్యోగరీత్యా నోయిడాలోని శతాబ్ది రైల్ విహార్ కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్‌మెంటులో తన స్నేహితులతో కలిసి ఉంటోంది.
#Noida: CCTV captures unidentified man shooting a 24-year-old woman techie in basement of society in Sector 62 @httweets @HTNoidaGzb pic.twitter.com/mPqaVYCbsR
— Peeyush Khandelwal (@journopk) May 31, 2017
ఓ ఫోన్ కాల్ రావడంతో ఆమె అపార్ట్‌మెంట్ బేస్మెంట్ వద్దకు వెళ్లింది. ఇంతలో మొహానికి ముసుగు ధరించిన ఓ యువకుడు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె సెల్లార్‌లో పరిగెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమెను వెంటాడి మరీ తుపాకీతో కాల్చి చంపాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
ఆమె మృతదేహాన్ని బుధవారం ఉదయం అపార్ట్‌మెంట్ వాసులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. హర్యానాలో ఉంటున్న అంజలి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఎవరో తెలిసిన వ్యక్తులే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications