వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబినెట్ విస్తరణ ఒకరోజు ముందుకు... ఆ ఎఫెక్టే కారణమా..?

|
Google Oneindia TeluguNews

కేంద్ర కేబినెట్ విస్తరణ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి జరగాలి.. మరీ ఒకరోజు ముందుకు ఎందుకు వచ్చింది.. వీలయితే వెనక్కి వెళ్లాలీ కానీ.. ఇలా బ్యాక్ వర్డ్ ఏంటీ అని అర్థం కావడం లేదు. మంచి పని చేసే సమయంలో తిథి, నక్షత్రం చూస్తాం. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ అయే.. అందుకే వారాలు, ఘడియలు చూసి ముందుకు మార్చింది అనుకొవచ్చు.

చతుర్దశి ఉండటంతో..

చతుర్దశి ఉండటంతో..

షెడ్యూల్ ప్రకారం అంటే 8వ తేదీన చతుర్దశి ఉంది. అమవాస్య/ పౌర్ణమికి ముందు చతుర్దశి వస్తుంది. ఏ మంచి పని చేపట్టకూడదని సనాతన హిందు ధర్మం చెబుతోంది. పౌర్ణమి ముందు చతుర్దశి నాడు.. ఏదో చిన్నచితకా పనులు చేసుకోవచ్చు.. కానీ అమవాస్యకు ముందు రోజు మాత్రం అస్సలు చేపట్టకూడదు. వాస్తవానికి ఇవన్నీ చూసే తేదీ నిర్ణయించి ఉంటారు. కానీ చివరలో ఏదో కొట్టి.. ముందుకు వచ్చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే గురువారమే మంత్రివర్గ విస్తరణ జరిగి ఉండేది.

చివరి క్షణంలో..

చివరి క్షణంలో..


ఆధునిక యుగం/ టెక్నాలజీ అని అంటుంటాం.. కానీ ఎవరి నమ్మకాలు వారివి.. అందుకే వారు ముందుకు వచ్చి విస్తరణ చేపట్టారు. పండితుల సలహాలు, సూచనలు తీసుకొని డిషినష్ తీసుకున్నారని స్పష్టమవుతోంది. వారి చర్యలే ఇందుకు అద్దం పట్టాయి.

మహిళలకు పెద్దపీట

మహిళలకు పెద్దపీట

బుధవారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల మధ్య కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేస్తారు. కేబినెట్‌లో 20 మందికి పైగా అవకాశం లభించనుంది. క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌తోపాటు ఐదు రాష్ట్రాల‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని తెలుస్తోంది.
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేప‌ట్టిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఇదే కాగా.. మ‌హిళా ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్లు సమాచారం. క్యాబినెట్‌లో 24 మంది మహిళల‌కు మోడీ చోటు క‌ల్పించే అవకాశమున్నట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది.

English summary
one day before modi cabinet expansion. because thursday is chaturdasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X