ఢిల్లీలో కూలిన భవనం, ఒకరు మృతి, సిలిండర్ పేలుడు వల్లే
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మోతీనగర్‌లో మూడంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్లో పోలీసులకు స్థానికులు సైతం సహాయం అందజేస్తున్నారు. బుధవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో భవనం కుప్పకూలినట్లు సమాచారం.

గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల భవనం కుప్పకూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడిని 20 ఏళ్ల వయస్సు గల ఆనంద్ శశినాథ్‌గా గుర్తించారు.
సంఘటనా స్థలం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. అయితే, ఓ చిన్నారి శిథిలాల కింద ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. గాయపడినవారిలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలున్నారు. వారు అద్దెకు ఆ భవనంలో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications