సైనికుల వీరోచిత పోరాటాలు నేటి యువత ముందుకు..BSFతో వన్ ఇండియా సంచలన ఒప్పందం..
డిజిటల్ ప్రపంచంలో దూసుకెళ్తున్న ప్రముఖ డిజిటల్ న్యూస్ సంస్థ వన్ ఇండియా సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. మరుగున పడిన మాణిక్యాలను వెలికితీసి భావితరాలకు స్ఫూర్తిని రగిలించే సంచలన నిర్ణయానికి నాంది పలికింది. దేశం కోసం పుట్టి.. దేశం కోసమే ప్రాణాలు వదిలిన వీర సైనికుల త్యాగాలను నేటి యువతకు అందించనుంది. దేశ రక్షణ.. దుష్ట శిక్షణే పరమావధిగా సాగుతున్న మన సైన్యం వీర గాథలను డిజిటర్ తెరపైకి ఆవిష్కరించి దేశ యువతలో స్ఫూర్తిని రగిలించే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వన్ ఇండియా.
ఎన్నో పోరాటాలు.. మరెన్నో త్యాగాలు.. బుల్లెట్ దిగినా.. రక్తం చిందినా.. దేశం కోసమే చివరి శ్వాస వరకూ సాగిన సైనికుల చరిత్రను నేటి యువత ముందుకు తీసుకొచ్చే మహోన్నత కార్యక్రమానికి వన్ ఇండియా డిజిటల్ న్యూస్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వన్ ఇండియా సంస్థ.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) ఒప్పందం చేసుకుంది. నేటి యువతలో దేశ భక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిలువనుంది.
1947 కు ముందు నుంచి నేటి డిజిటల్ యుగం వరకూ శత్రువు ఎన్నో రకాలుగా ముసుగులు ధరించి దేశంపై దాడి చేసినా భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ కాలచక్రంలో భారత సైనికులు ఎన్నో త్యాగాలు చేశారు. మరెన్నో పోరాటాల్లో విజయ దుందుభి మోగించారు. కానీ వీటిల్లో నేటి యువతకు తెలిసినవి కొన్ని మాత్రమే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే వన్ ఇండియా.. అలా మరుగున పడిన సైనికుల జీవిత విశేషాలు, దేశ రక్షణలో భాగంగా వాళ్లు నిర్వహించిన ఆపరేషన్స్ ను నేటి యువతకు డిజిటల్ మాధ్యమం ద్వారా అందించేందుకు సిద్ధమైంది.

అయితే ఈ ఒప్పందంలో భాగంగా యావత్ భారతావనికి వన్ ఇండియా చేరువ కానుంది. సైనికుల వీర గాథలను దేశంలోని అన్ని ప్రముఖ స్థానిక భాషల్లో అందించనుంది. ఈ మేరకు టైర్-2, టైర్-3 సిటీలను కూడా టచ్ చేసి సైనికుల వీర గాథలను యువతకు పరిచయం చేయనుంది. సైనికుల చరిత్రను షార్ట్ వీడియోలు, ఆర్టికల్స్, ఇంటర్వ్యూ, రీల్స్ , లైవ్ కవరేజీ ద్వారా దేశ ప్రజలకు 24x7 అందించనుంది.
ఇక వన్ ఇండియా సంస్థను 2006లో స్థాపించారు. ఈ సంస్థ దేశంలోనే ప్రాముఖ్యత కలిగిన డిజిటల్ న్యూస్ మాధ్యమాల్లో ఒకటిగా నిలిచింది. స్థానిక భాషల్లో వార్తా విశేషాలను అందిస్తూ దూసుకెళ్తోంది. 8 స్థానిక భాషలైన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాళీ, గుజరాతీ, ఒడియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ దేశ ప్రజలకు 24x7 వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. కామ్ స్కోర్ నివేదిక ప్రకారం.. వన్ ఇండియా సంస్థ దశాబ్దాలుగా టాప్ 10 స్థానాల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోంది. క్వాలిటీ కథాంశాలకు వన్ ఇండియా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పోర్టల్ ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications