ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్... పటేల్ ఆకాంక్ష నెరవేర్చామన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆకాంక్షను నెవవేర్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్‌లో రాజ్యాలను పటేల్ విలీనం చేశారని .. కానీ కశ్మీర్ మాత్రమే అలాగే ఉండిపోయిందన్నారు. ఇన్నాళ్లకు కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసినట్టు పేర్కొన్నారు. ఇక నుంచి ఓకే దేశం, ఓకే రాజ్యాంగం అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేశారు మోడీ. తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు.

కశ్మీరీలకు స్వేచ్ఛ

కశ్మీరీలకు స్వేచ్ఛ

జమ్ముకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370, 35 ఏ సెక్షన్లను రద్దు చేసి కశ్మీరీ ప్రజలకు దేశంలో మిగతావారిలాగా సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన 10 వారాల్లోనే కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఉక్కుమనిషి పటేల్ కోరిక కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడమేనని ... దానిని తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. గత పాలకుల స్వార్థ ప్రయోజనాలు, నిర్లక్ష్యం వల్లే కశ్మీర్‌కు ఈ గతి పట్టిందన్నారు. వారు 70 ఏళ్లలో చేయనిది తాము 70 రోజుల్లో చేశామన్నారు. ఇకనుంచి దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే రాజ్యం అమల్లో ఉంటాయని తేల్చిచెప్పారు. పటేల్ కల ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ కలను తమ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు.

పెరుకుపోయిన అవినీతి

పెరుకుపోయిన అవినీతి

ఆర్టికల్ 370తో జమ్ము కశ్మీర్, లడఖ్‌లో అవినీతి పెరగిపోయిందన్నారు ప్రధాని మోడీ. అంతేకాదు అక్కడి ప్రజలు సమాన హక్కులు పొందలేకపోయారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు హక్కుల విషయంలో ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. తర్వాత చిన్నారులు, దళితులు, గిరిజన తెగల వారి వర్ణాణాతీతమన్నారు. వారు గత కొన్నేండ్లుగా పడుతున్న ఇబ్బందిని ఎట్టకేలకు తాము నెరవేర్చమని తెలిపారు. రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టాక మొదటిసారి ఎర్రకోటపై ప్రధాని మోడీ ప్రసంగించారు.

ఆరోసారి ..

ఆరోసారి ..

2014 నుంచి 2018 వరకు ఐదు సార్లు ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేశారు నరేంద్ర మోడీ. 2019 ఆగస్ట్ 15తో అది ఆరోసారి. ఇదివరకు 1998 నుంచి 2003 వరకు వాజ్ పేయి ఆరుసార్లు జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో మోడీ వాజ్ పేయి సరసన చేరారు. జాతీయ జెండా ఎగరవేసి .. ఆరో ప్రసంగం చేసి రికార్డు సాధించారు. ఆరో ప్రసంగంతోపాటు మరో ప్రాధాన్యం కూడా ఉంది. ఈ సారి ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన లాంటి చారత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తన ప్రసంగంలో మోడీ కశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+