రేపే జమిలి బిల్లు - ఆ వెంటనే, బిగ్ ప్లాన్..!!

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ముందుకు రేపు (మంగళ వారం) జమిలి బిల్లు రానుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. నేడు సభలో ప్రవేశ పెట్టా ల్సిన బిల్లును రేపటికి వాయిదా వేసింది. సభలో ప్రవేశ పెట్టిన తరువాత జాయింట్ కమిటీకి బిల్లు ను పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లు ద్వారా పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఎన్నికల సమయం పై బిల్లు ఆమోదం తరువాత స్పష్టత రానుంది.

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం సిద్దం చేసిన రెండు బిల్లులు మంగళవారం సభ లో ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టేలా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ బిల్లును చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి పంపాలని డిసైడ్ అయ్యారు. తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ రోజునే జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే, రివైజ్ షెడ్యూల్ లో బిల్లుల ప్రవేశం అంశం తెలిగించారు.

One nation one Election bill to introduce in parliament on Tuesday could be refer to JPC

ఇప్పుడు ఈ బిల్లులను మంగళవారం సభలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులను ఆమోదిస్తే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ తో పాటుగా అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు జరిపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ టర్మ్ లోనే జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా కార్యాచరణ పూర్తి చేస్తామని గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. రామనాధ్ కమిటీ సిఫార్సులను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం.. తాజాగా జమిలికి సంబంధించి రెండు బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ఇక, ఇప్పుడు బిల్లుల ఆమోదానికి సంఖ్య పరంగానూ రెండు సభల్లో బీజేపీ ముందస్తు కసరత్తు చేసింది.

ప్రస్తతం రాజ్యసభలో రాజ్యంగం పైన చర్చ జరుగుతున్న వేళ..కేంద్రం వ్యూహాత్మకంగా ఈ రోజు ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల పైన నిర్ణయం వాయిదా వేసింది. జమిలి బిల్లుల పైన ప్రతిపక్షాల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాధాన్యత ఉన్న నిర్ణయం కావటంతో ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీంతో, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయనున్నారు. కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకొని బిల్లులకు ఆమోదం తెలిపి.. ఒకే ఎన్నిక విధానం అమలు చేసేలా కేంద్రం కార్యాచరణ సిద్దం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+