ఆదాయం కోసమైనా వైన్ షాపులు తెరవండి ..ఈ మాట అన్నదెవరో తెలుసా !!
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు వైన్స్ కూడా బంద్ కొనసాగటంతో మందుబాబులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు . ఇక వారి మాట అలా వుంచితే మద్యం షాపులు లేకపోవటం వల్ల అటు ప్రభుత్వానికి తీరని నష్టం వస్తుంది. విపరీతమైన ఆర్ధిక కష్టం కలుగుతుంది . దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోంది. ముఖ్యంగా రాష్ట్రాలకు లిక్కర్ నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది. కానీ ఇప్పుడు గత నెల రోజులుగా లాక్ డౌన్ కారణంగా వైన్ షాపులు మూతపడడంతో ఆదాయం శూన్యంగా మారింది. దీంతో దీంతో అన్ని ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి.
అసలే కరోనా కష్ట కాలం . ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన సమయం .ఇప్పుడు ఆర్ధిక వనరుల అవసరం ఏ రాష్ట్రానికి అయినా ఉంటుంది . ఇక ప్రతి రాష్ట్రానికి ఒకవైపు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నా మరోవైపు సంక్షేమ పధకాలకు నిధులు అందించాల్సి వస్తోంది. అంతేకాదు ప్రతి నెలా, నెల తిరిగే సరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి .ఇక ఆదాయం లేకుండా జీతాలు ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. అందుకే వీలైనంత త్వరగా లాక్ డౌన్ ను సడలించాలని, లాక్ డౌన్ ను ఎత్తేయాలని అంటున్నారు.

అయితే, లాక్ డౌన్ ను ఎత్తెయ్యకపోయినా, కనీసం సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ వైన్ షాపులు తెరిచి మద్యం అమ్మకాలు చేపట్టొచ్చని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకి లేఖ రాశారు. ఆదాయం లేకుంటే రాష్ట్రం ముందుకు నడవలేదని రాజ్ థాకరే తన లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ మద్యం షాపులు తెరిపించాలని లేఖ రాయటం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications