ఆపరేషన్ సింధూర్: ఇక ఊచకోతే, రాజ్‌నాథ్ వార్నింగ్

ఒకవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంటే, మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాగ్‌రాజ్‌లో సైనిక పరాక్రమం గురించి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తించింది. "ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక సైనిక చర్య కాదు, అది సాంకేతిక యుద్ధానికి (Technical Warfare) ఒక ఆదర్శ నమూనా" అని ఆయన అభివర్ణించారు. దేశం ఎన్నికల మూడ్‌లో ఉన్నప్పటికీ, సరిహద్దు భద్రత, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి విషయంలో ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో మన స్వదేశీ క్షిపణి వ్యవస్థల పాత్రను రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఆకాష్ క్షిపణి వ్యవస్థ, ఆకాష్‌తీర్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ క్షిపణులను ఈ ఆపరేషన్‌లో సమర్థవంతంగా వినియోగించినట్లు ఆయన వెల్లడించారు. "మన సైన్యం కేవలం ఆయుధాలను వాడటమే కాదు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సిద్ధహస్తులని ఈ ఆపరేషన్ నిరూపించింది" అని ఆయన గర్వంగా ప్రకటించారు.

Operation Sindhur Rajnath Singh Hails Technical Warfare Success as NDA Dominates 2026 Election Trends
Pok ఇక మనదే? పాక్ ను చావు దెబ్బ తీసిన డీలిమిటేషన్!
Pok ఇక మనదే? పాక్ ను చావు దెబ్బ తీసిన డీలిమిటేషన్!

శత్రువులకు గట్టి హెచ్చరిక..

ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్' విధానాన్ని ఆయన పునరుద్ఘాటించారు. "మనం అత్యంత సంయమనం పాటిస్తూ కేవలం ఉగ్రవాదులను మాత్రమే ఏరిపారేశాం. మన సైన్యం సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలుసు, అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్తాం" అని శత్రువులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. గతంలో శత్రువుల బలంపై మనకు ఒక అంచనా ఉండేదని, కానీ ఇప్పుడు సాధారణ పౌర వస్తువులే ప్రాణాంతక ఆయుధాలుగా మారుతున్న 'అన్-ప్రెడిక్టబుల్' కాలంలో మనం నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆయన సైన్యాన్ని కోరారు.

భారత్‌పై కన్నేస్తే 'డాట్.. డాట్.. డాట్..': పాకిస్థాన్‌కు మాస్ వార్నింగ్!
భారత్‌పై కన్నేస్తే 'డాట్.. డాట్.. డాట్..': పాకిస్థాన్‌కు మాస్ వార్నింగ్!

పరిశోధనలే రేపటి విజయాలు..

"భవిష్యత్తు యుద్ధాలు యుద్ధభూమిలో కాదు, ప్రయోగశాలల్లో (Labs) గెలవబడతాయి" అని రాజ్‌నాథ్ సింగ్ ఒక గొప్ప సూత్రాన్ని చెప్పారు. అందుకే రక్షణ రంగ బడ్జెట్‌లో 25 శాతాన్ని స్టార్టప్‌లు, విద్యాసంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల పరిశోధనల (R&D) కోసం కేటాయించినట్లు తెలిపారు. DRDO తన పేటెంట్లను ఉచితంగా పరిశ్రమలకు ఇస్తూ, 'రక్షా త్రివేణి సంగమం' (సాంకేతికత, పరిశ్రమ, సైన్యం) ద్వారా దేశాన్ని రక్షణ రంగంలో అగ్రగామిగా నిలబెడుతోందని ఆయన వివరించారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే వంటి మౌలిక సదుపాయాలు కూడా రేపు యుద్ధ సమయంలో సైనిక కదలికలకు ఆస్తులుగా మారుతాయని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+