అయోధ్య, కాశీ అభివృద్ధిని ప్రతిపక్షాలు కమ్యూనల్ లెన్స్‌లోనే చూస్తున్నాయి: ప్రధాని మోడీ ఫైర్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఐదో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయోధ్య, కాశీలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రతిపక్ష పార్టీలు కమ్యూనల్ లెన్స్‌లో చూస్తున్నామని మండిపడ్డారు.
గురువారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతాప్‌గఢ్ , సోరోన్, ప్రతాప్పూర్, ఫుల్పూర్, హండియా, బారా, మేజ, కర్చన, ఫంఫమౌ నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకే వస్తాయి. గంగా నదిని శుభ్రం చేయడం పర్యావరణ రక్షణ కోసమే చేశామని, కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల ద్వారా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పీఎం గతి శక్తి ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించేందుకు దోమదపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. మిషన్ ఆయిల్ పామ్ ద్వారా వంటనూనెల దిగుమతులు తగ్గుతాయన్నారు. అగ్రి వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు ఈ బడ్జెట్ మార్గం చూపిందన్నారు. వేస్ట్ నుంచి శక్తిని ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు ఆదాయం వస్తుందన్నారు. 50 లక్షలకుపైగా పోస్టు ఆఫీసులు బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తూ రైతుల అవసరాన్ని తీరుస్తున్నాయన్నారు.
అగ్రి రీసెర్చ్ సంబంధిత మానవ వనరుల అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆధునిక కాలానుసారం నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంపై కేంద్ర బడ్జెట్ 2022 ప్రభావంపై వెబినార్ ద్వారా ప్రసంగించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే నాల్గు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మరికొద్ది రోజుల్లో ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ కీలక నేతలు రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications