దాడికి నా భర్తను వాడుకుంటున్నారు: ప్రియాంక
న్యూఢిల్లీ: తన భర్తపై, తన కుటుంబంపై రాజకీయ దాడికి తాను ఆవేదనకు గురవుతున్నట్లు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ అన్నారు. మరింత కృతనిశ్చయంతో తాను వారిపై పోరాటం చేస్తానని ఆమె అన్నారు. తన భర్తకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా చాలా కఠిన పదాలు వాడుతున్నారని ఆమె అన్నారు.
తనను, తన కుటుంబాన్ని అవమానించడానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని, అది విచారకరమని ఆమె అన్నారు. వాటిని భరించడం ఎలాగో తాను ఇందిరా గాంధీనుంచి నేర్చుకున్నట్లు ప్రియాంక చెప్పారు. తన భర్త వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.

రాయబరేలీ సభలో ఆమె ప్రసంగించారు వారు ఎంతగా తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే అంతటి స్థాయిలో తాను ప్రతిస్పందిస్తానని ఆమె అన్నారు. సోనియా గాంధీకి ఓటేయాలని ఆమె కోరారు. ప్రజలు వేసే ఓటు సోనియాకు కాదని, వారి పిల్లలకూ వారి దేశానికి అని ఆమె అన్నారు
తన తల్లి ఈ దేశంలో పుట్టలేదని, అయితే ఆమెను అంగీకరించారని, అదే ఈ దేశం అందమని ప్రియాంక గాంధీ అన్నారు. సోనియా అక్కడి ప్రజలతో పెంచుకున్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications