మీరు చేసింది ధర్మ యుద్ధమా?: పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు స్టాలిన్ సూటి ప్రశ్న
సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు. ఇన్నాళ్లు ధర్మ యుద్ధం చేస్తున్నామని వారు చెప్పుకున్నారని, పదవులు దక్కడంతో ఇప్పుడిక ధర్మ యుద్ధం ముగిసిందన్నారు.
చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు.
అన్నాడీఎంకే నేతలు ధర్మ యుద్ధం చేస్తున్నామని ఇన్నాళ్లు చెప్పుకున్నారని, అయితే పదవుల కోసం ఈ రోజు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు కలిశారని విమర్శించారు.

పదవుల కోసం పాకులాడడమే ధర్మ యుద్ధమా? అని ప్రశ్నించారు. పదవులు దక్కడంతో ఇక ధర్మయుద్ధం ముగిసిందా? అని ఎద్దేవా చేశారు.
ఆ ఇరువర్గాల కలయిక ఓ నాటకమని, పళనిస్వామి, పన్నీర్ సెల్వం మహానటులని స్టాలిన్ వ్యాఖ్యానించారు. పదవులు పొందడం కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications