వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానితో రాహుల్ భేటీ: మారిన కాంగ్రెస్ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదాస్పద ఆర్డినెన్స్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెసు కోర్ కమిటీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోర్ కమిటీ సమావేశం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆర్డినెన్స్ ఉపసంహరణపై ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఆ విషయాన్ని తెలిపే అవకాశం ఉంది.

అంతకుముందు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య వివాదాస్పద ఆర్డినెన్స్ వ్యవహారంపై దాదాపు 30 నిమిషాలపాటు చర్చ జరిగినట్లు సమాచారం. తన వ్యాఖ్యలు రాజకీయపరంగా దుమారం రేపిన కారణంగా ప్రధానిని కలిసి రాహుల్ గాంధీ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రివర్గాన్ని కానీ, ప్రధాన మంత్రి అధికారాన్ని తప్పుబట్టలేదని రాహుల్ గాంధీ ప్రధానికి చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆర్డినెన్స్‌పై తన సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని, అది ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా ఆ ఆర్డినెన్స్ న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలించి ఆమోదించిందని, ఇది నేర చరితులను రక్షించేందుకు చేయబడినది కాదని ప్రధాని మన్మోహన్ తెలిపారు.

ఆర్డినెన్స్ పూర్తి అర్థ రహితంగా ఉందని, దాన్ని చించిపారేయాలని రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందె. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ.. తాను చిన్న చిన్న విషయాలకు మనస్తాపం చెందనని, ప్రధాని పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మన్మోహన్ ప్రకటించారు.

English summary
Congress Vice President Rahul Gandhi today met Prime Minister Manmohan Singh to discuss the reasons behind his (Rahul's) outburst on the controversial ordinance to protect convicted legislators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X