వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం, బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Budget Session 2020 : President Ramnath Kovind Addresses The Joint Session Of Parliament

నవభారత నిర్మాణానికి అందరూ కృషి చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, రాం మనోహర్ లోహియా, దీన్ దయాళ్ ఆశయాలు నేరవేర్చాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవ నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు.

కీలక బిల్లులకు ఆమోదం..

కీలక బిల్లులకు ఆమోదం..

గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం రికార్డు సృష్టించిందని చెప్పారు. పలు కీలక బిల్లులను ఆమోదించిందని గుర్తుచేశారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని రాం జన్మభూమి వివాదాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎళ్లవేళలా పనిచేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని నొక్కి వక్కానించారు.

ప్రతిభ

ప్రతిభ

రెండోసారి ప్రజలు అఖండ మెజార్టీ అందించారని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్నవేషన్ ర్యాంకింగ్‌లో కూడా భారత ర్యాంకు మెరుగుపడింది. ఇతర దేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించి.. దేశానికి ఆదాయం సమకూర్చడంలో టూరిజం శాఖ మంచి ప్రతిభ కనబరిచిందని చెప్పారు. వివిధ రంగాల్లో భారత్ విశేష ప్రతిభ కనబరిచిందని చెప్పారు. ఈ దశాబ్దంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి కోసం

అభివృద్ధి కోసం

జమ్ముకశ్మీర్ విభజించి అక్కడి ప్రజలకు స్వేచ్చ వాయువులు ప్రసాదించామని రాష్ట్రపతి గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్, లడాఖ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. స్వచ్చ్ భారత్ అభియాన్ లాంటి కీలక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

English summary
our government priority social backward classes president ramnath kovind on budget speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X