వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో రామా! -సంతకాలు చేశారు, డబ్బులు మరిచారు -అయోధ్య ఆలయ విరాళాల్లో 15 వేల చెక్కులు బౌన్స్!!

|
Google Oneindia TeluguNews

సుదీర్ఘ కోర్టు వివాదాలు ముగిసి, ఎట్టకేలకు అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం కాగా, సాధారణ భక్తులు, రామ ప్రేమికులతోపాటు హిందూ అతివాద సంస్థలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణను ఉద్యమంలా చేపట్టాయి. కోట్ల మంది తమ వంతుగా భగవంతుడి పేరిట చందాలు చదివించుకోగా, ఇంకొందరు రాజసంగా చెక్కులు రాసిచ్చారు. అయితే వాటిలో వేలాది చెక్కులు బ్యాంకుల్లో బౌన్స్ అయ్యాయి..

ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి? ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి?

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సేకరించిన 15 వేల బ్యాంకు చెక్కులు బౌన్స్ అయ్యాయి. వీటి విలువ రూ.22 కోట్లుగా ఉంది. బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధులు లేకపోవడం లేదా సాంకేతిక లోపాల కారణంగా చెక్కులు బౌన్స్ అయినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన ఆడిట్ నివేదికలో వెల్లడించింది.

Over 15,000 cheques worth Rs 22 crore received for Ram temple in Ayodhya bounce

సాంకేతిక లోపాలను సవరించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా పేర్కొన్నారు. ప్రజలు మరోసారి డొనేషన్ ఇవ్వాలని బ్యాంకులు అడుగుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా బౌన్స్ అయిన 15 వేల బ్యాంకు చెక్కుల్లో సుమారు రెండు వేల చెక్కులు అయోధ్య ప‌రిధిలో వ‌సూలు చేసిన‌వి కాగా మిగ‌తా 13 వేల చెక్కులు దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో వ‌సూలు చేసిన‌వి అని వివ‌రించారు.

 ఏపీ సీఎం జగన్‌కు షాక్: బెయిల్ రద్దు పిటిషన్‌పై 22న విచారణ -తొలి విజయమన్న ఎంపీ రఘురామ ఏపీ సీఎం జగన్‌కు షాక్: బెయిల్ రద్దు పిటిషన్‌పై 22న విచారణ -తొలి విజయమన్న ఎంపీ రఘురామ

రామ మందిరం నిర్మాణం కోసం ట్ర‌స్ట్‌, విశ్వ‌హింద్ ప‌రిష‌త్ స‌భ్యులు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన విరాళాల వ‌సూళ్ల కార్య‌క్ర‌మంలో రూ.2,500 కోట్ల‌కుపైగా వ‌సూలైన‌ట్లు ట్ర‌స్ట్ వెల్ల‌డించింది. తుది వివరాలను ట్రస్ట్ ఇంకా ప్రకటించలేదు.

English summary
More than 15,000 cheques collected as donation for the construction of the Ram temple in Ayodhya have bounced. The total face value of these cheques, collected by the Vishwa Hindu Parishad (VHP) and other affiliated outfits, is nearly Rs 22 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X