ఓవైసీకీ, బీజేపీకి చెడిందా ? బీహార్లో బేరసారాల వెనుక ?
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గత కొన్నేళ్లుగా బీజేపీకి బీ-టీమ్ గా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం తనకు పట్టున్న హైదరాబాద్ దాటి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు కూడా ప్రయత్నించని ఓవైసీ.. ఉన్నట్లుండి ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, బీహార్, యూపీల్లో వెళ్లి పోటీ చేయడమే. ఈ పోటీ వెనుక బీజేపీతో పరోక్ష అవగాహన ఉండటమే కారణమన్న విమర్శల్ని ఆయన ఎదుర్కొన్నారు. అయితే తాజాగా ఓవైసీ రూటుమార్చారు.
బీజేపీకి బీ-టీమ్ అన్న విమర్శలకు చెక్ పెట్టాలని అనుకున్నారో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ ఓవైసీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ప్రత్యర్ధులైన కాంగ్రెస్-ఆర్జేడీవైపు చూస్తున్నారు. వీళ్లు నడుపుతున్న మహాకూటమిలో తాము కూడా చేరతామని, కేవలం ఆరు సీట్లు ఇస్తే చాలని వారి ముందు ఆఫర్ కూడా పెట్టారు. దీనిపై ఆ రెండు పార్టీలు స్పందించడం లేదు. దీంతో ఓవైసీ అసహనానికి గురై ప్రజలే తమ పొత్తుల్ని తేలుస్తారని ఇవాళ ప్రకటించారు.

గతంలో బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఐదు సీట్లు గెల్చుకున్న ఓవైసీ పార్టీ ఎంఐఎంకు అతి కొద్ది కాలంలోనే షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత ఓవైసీ తిరిగి ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడంతో వారంతా ఆర్జేడీలోకి ఫిరాయించారు. దీంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు నేరుగా ఆర్జేడీ కూటమితోనే పొత్తు పెట్టుకునేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు లేఖ రాశారు. అయితే దీనికి ఆయన స్పందించలేదు.

#WATCH | Kishanganj, Bihar: On Bihar polls, AIMIM chief and MP Asaduddin Owaisi says, "Akhtarul Iman has written a letter to the LoP here (Tejashwi Yadav) and we have said through media that AIMIM is ready for alliance. Akhtarul Iman has also written that they can give us 6… pic.twitter.com/E9hoB3S8wq
— ANI (@ANI) September 24, 2025
దీనిపై ఓవైసీ ఇవాళ స్పందించారు. తాము మీడియా ద్వారా ఎంఐఎం పొత్తుకు సిద్ధంగా ఉందని చెప్పామని, ఆరు సీట్లు అడిగామని వెల్లడించారు. అది వారి ఇష్టం కాదని, వారు ఇలా చేయకపోతే, బీహార్ ప్రజలు బిజెపీకి ఎవరు మద్దతిస్తున్నారో, వారిని ఎవరు అడ్డుకుంటున్నారో నిర్ణయిస్తారన్నారు. కాబట్టి నిర్ణయం బీహార్ ప్రజలదే అన్నారు. తాము తమ బాధ్యతను నిర్వర్తిస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసి బీజేపీకి పరోక్షంగా సాయం చేసిన ఓవైసీ.. ఇప్పుడు ఇలా రూటు మార్చి వారితోనే పొత్తుకు సిద్ధం కావడం చూస్తుంటే కాషాయ పార్టీతో బంధానికి చెక్ పడినట్లే చెప్పవచ్చు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications