పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం: ఏపీ, తెలంగాణలో వరించింది వీరినే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి 2024 ఏడాదికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మ అవార్డులు లభించాయి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, కళాకారులకు పద్మ అవార్డులు వరించాయి.

పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారు:

తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యను పద్మశ్రీ వరించింది.
తెలంగాణలోని నారాయణపేటకు చెందిన దామరగిద్దవాసి దాసరి కొండప్పను పద్మశ్రీ వరించింది. ఈయన బుర్ర వీణ వాయిద్యకారుడు కొండప్ప.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు వరించింది. ఈమె కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందినవారు.

Padma Awards 2024 announced: know complete list of winners

పద్మశ్రీ అవార్డులు విభాగాల వారీగా:

కళలు:
గడ్డం సమ్మయ్య: తెలంగాణ
దాసరి కొండప్ప: తెలంగాణ
ఉమామహేశ్వరి : ఆంధ్రప్రదేశ్
జానకీలాల్: రాజస్థాన్
గోపీనాథ్ స్వైన్: ఒడిశా
భాగబత్ పదాన్: ఒడిశా
స్మృతి రేఖ చక్మా: త్రిపుర
ఓంప్రకాశ్ శర్మ: మధ్యప్రదేశ్
నారాయణన్ ఈపీ: కేరళ

సనాతన్ రుద్ర పాల్: పశ్చిమబెంగాల్
నేపాల్ చంద్ర సూత్రధార్: పశ్చిమబెంగాల్
రతన్ కహార్: పశ్చిమబెంగాల్
భద్రప్పన్ ఎం: తమిళనాడు
జోర్డాన్ లేప్పా: సిక్కిం
మిచహన్ నాసా: మణిపూర్
శంతీదేవీ పాసవాన్, శివన్ పాసవాన్: బీహార్
అకోశ్ కుమార్ బిశ్వాస్: బీహార్
బాలకృష్ణన్ సాధనమ్ పుథియా వీతిల్: కేరళ
బాబూ రాంయాదవ్: ఉత్తరప్రదేశ్

సామాజిక సేవా విభాగం:

సోమన్న: కర్ణాటక
జగేశ్వర్ యాదవ్: ఛత్తీస్‌గఢ్
చామి ముర్మూ: జార్ఖండ్
గుర్విందర్ సింగ్: హర్యానా
దుఖు మాఝీ: పశ్చిమబెంగాల్
సంగ్ధాన్‌కిమా: మిజోరం

వైద్య విభాగం:

హేమచంద్ మాంఝీ: ఛత్తీస్‌గఢ్
యజ్దీ మాణెక్ షా ఇటాలియా: గుజరాత్
ప్రేమ ధన్‌రాజ్: కర్ణాటక

క్రీడా విభాగం:
ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే: మహారాష్ట్ర

మిగితా విభాగాలు:
యనుంగ్ జామెహ్ లెగో: అరుణాచల్ ప్రదేశ్
సర్బేశ్వర్ బాసుమతరి: అస్సాం
సత్యనారాయణ బెలేరి: కేరళ
కె చెల్లామ్మళ్: అండమాన్ వికోబార్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+