సంజయ్ భన్సాలీకే కాదు.. 'పద్మావతి'ని వదలని కష్టాలు..

సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన ‘పద్మావతి'కి షూటింగ్‌ ప్రారంభం నుంచే కష్టాలు చుట్టుముట్టాయి.

Recommended Video

    Padmavati Controversy: Deepika Padukone Trolled Again | Oneindia Telugu

    ముంబై: సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన 'పద్మావతి'కి షూటింగ్‌ ప్రారంభం నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. వచ్చేనెల ఒకటో తేదీన విడుదల కానున్న ఈ సినిమాను నిషేధించాలంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సినిమా రాజపుత్రులను కించపరిచేలా ఉన్నదని పేర్కొంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ లోని ఛిత్తోడ్ గడ్ కోట వద్ద నిరసన కాల్పులు జరిపే వరకూ వెళ్లింది. గతంలో సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్నది.

    అటువంటి చిత్రాల భారీన 'పద్మావతి' చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారిన పడింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేసిన సెట్‌లోకి చొరబడి ఆ సెట్‌నూ, విలువైన పరికరాలనూ ధ్వంసం చేయడంతోపాటు భన్సాలీపై దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత షూటింగ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు మార్చుకుంటే అక్కడా సెట్‌కు నిప్పు పెట్టారు.

     సినిమాల చిత్రీకరణపై వివిధ సంస్థల అడ్డగోలు వాదనలు

    సినిమాల చిత్రీకరణపై వివిధ సంస్థల అడ్డగోలు వాదనలు

    భారతదేశంలో చలనచిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ చూసి అవి ఆమోదయోగ్యమో కాదో తేల్చడానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ఉంది. అది గీసే సవాలక్ష ‘లక్ష్మణరేఖల'పైనా, కత్తిరింపులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ పనుల్ని అంతకంటే మూర్ఖంగా, మోటుగా చేయడానికి దేశంలో ఎక్కడికక్కడ సంస్థలు పుట్టుకు వస్తున్నాయి. సినిమా ఎలా ఉండాలో, కథనం ఎలా షూట్ చేయాలో, ఎలా పాటలు చిత్రీకరించాలో నిర్దేశించేందుకు ఆయా సంస్థలు హెచ్చరికలు జారీ చేసేందుకు వెనుకాడటం లేదు.

     దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నదని వెనక్కు పంపిన సీబీఎఫ్‌సీ

    దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నదని వెనక్కు పంపిన సీబీఎఫ్‌సీ

    ఎలాగోలా షూటింగ్ పూర్తి చేసుకుని.. సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ తెచ్చుకున్నాక.. కర్ణిసేన, రాజపత్రుల పేరిట దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వరుస నిరసనలతో ఆందోళనలతో కేంద్ర సెన్సార్ బోర్డులోనూ కదలిక మొదలైంది. పద్మావతి సినిమాకు ఫిల్మ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ చేసుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నదని, ఈ నేపథ్యంలో దరఖాస్తును తిరిగి వెనక్కి పంపుతున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) తెలిపింది.

     ఛిత్తోడ్‌గఢ్ కోట వద్ద గాలిలోకి ఆందోళనకారుల కాల్పులు

    ఛిత్తోడ్‌గఢ్ కోట వద్ద గాలిలోకి ఆందోళనకారుల కాల్పులు

    పద్మావతి సినిమాను వ్యతిరేకిస్తూ పలువురు రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్నారని, ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని సినిమాను సమీక్షించుకోవాలని అనంతరం ఫిల్మ్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సెన్సార్ బోర్డు సూచించింది.శుక్రవారం రాజస్థాన్‌లో పద్మిని ప్యాలెస్‌ నెలకొన్న చిత్తోడ్‌గఢ్‌ కోట వద్ద నిరసన ప్రదర్శనలో కర్ణిసేన కార్యకర్తలు కత్తులు, ఇతర మారణాయుధాలతో విన్యాసాలు ప్రదర్శిస్తూ గాల్లోకి కాల్పులు కూడా జరిపారు.

     ఛిత్తోడ్ గఢ్ కోట ప్రవేశ ద్వారం మూసివేత

    ఛిత్తోడ్ గఢ్ కోట ప్రవేశ ద్వారం మూసివేత

    ఛిత్తోడ్‌గఢ్‌లో ఆందోళన కారులు కాల్పులు జరుపడంతో భయాందోళనకు గురైన విదేశీ పర్యాటకులు పరుగులు పెట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుపొందిన చిత్తోడ్‌గఢ్ కోట ను అధికారికంగా మూసేయలేదని స్థానిక ఎస్పీ ప్రశాన్ కుమార్ కంసేర తెలిపారు. పర్యాటకులు కోటలోకి వెళ్లే ప్రవేశ ద్వారాన్ని ఆందోళనకారులు మూసేశారని తెలిసిందని, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా భద్రతాదళాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఛిత్తోడ్ గఢ్ కోట పర్యాటకుల కోసం తెరిచే ఉంటుందని పేర్కొన్నారు.

     ఆమె రాష్ట్రపతి కాదని ఇలా వ్యాఖ్య

    ఆమె రాష్ట్రపతి కాదని ఇలా వ్యాఖ్య

    కాగా, పద్మావతి సినిమాను విడుదల చేసి తీరుతామన్న రాణి పద్మిని పాత్రధారి దీపికా పదుకోన్‌ ఏమైనా రాష్ట్రపతినా? అని కర్ణిసేన చీఫ్‌ లోకేంద్ర సింగ్‌ కాల్వి ప్రశ్నించారు. 'పద్మావతి' విడుదలకు ఆదేశాలిచ్చేందుకు ఆమె భారత రాష్ట్రపతి కాదని అన్నారు. 'అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రేమికురాలిగా రాణి పద్మావతిని చూపిస్తే ఎవరైనా సహించ గలరా? ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదలవుతుదంటూ మాట్లాడటానికి ఆమె (దీపిక) ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు. మమ్మల్ని రెచ్చగొట్టేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. నేను చెబుతున్నాను. ఆ సినిమా రిలీజ్ కానీయం' అని కల్వి తెలిపారు.

     దీపిక, బన్సాలీలకు ఇలా హెచ్చరికలు

    దీపిక, బన్సాలీలకు ఇలా హెచ్చరికలు

    సంజయ్ లీలా బన్సాలీకి పద్మావతి పేరు ఎత్తే అర్హత కూడా లేదని కర్ణిసేన చీఫ్‌ లోకేంద్ర సింగ్‌ కాల్వి అన్నారు. ఒక్క కర్ణిసేన మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సినిమాపై బహిరంగ వ్యతిరేకతను వ్యక్తం చేయాలని కర్ణిసేన చీఫ్‌ లోకేంద్ర సింగ్‌ కాల్వి కోరారు. సినిమా విడుదల కాకుండా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీకి తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఆమె ముక్కు కోస్తామని కర్ణిసేన హెచ్చరికలు జారీ చేసింది. ఇక పద్మావతి డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ, దీపికా పదుకోన్‌ల తలనరికిన వారికి రూ 5 కోట్లు ఇస్తామని యూపీకి చెందిన చైతన్య సమాజ్‌ పేర్కొంది.

     అజ్మీర్ ఖాజా ఛిస్తి దర్గా కూడా నిషేధం కోరుతూ ప్రకటన

    అజ్మీర్ ఖాజా ఛిస్తి దర్గా కూడా నిషేధం కోరుతూ ప్రకటన

    సర్వ్‌ బ్రాహ్మణ మహాసభ కూడా పద్మావతిపై సీబీఎఫ్‌సీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. పద్మావతి సినిమాను ముస్లింలు కూడా బహిష్కరించాలని అజ్మీర్‌ దర్గా దీవాన్‌ జైనుల్‌ ఆబెదీన్‌ అలీ పిలుపునివ్వడం గమనార్హం. ఓ బ్రాహ్మణ సంస్థ ‘పద్మావతి' చిత్రాన్ని నిషేధించాలని కోరుతోంది. అజ్మీరులోని ఖాజా మొయినుద్దీన్ ఛిస్తీ దర్గా కూడా ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

     పద్మావతిపై హెచ్చరికలను ఖండించిన ప్రకాశ్ రాజ్

    పద్మావతిపై హెచ్చరికలను ఖండించిన ప్రకాశ్ రాజ్

    రాజ్‌పుత్‌ కర్ణిక సేన కార్యకర్తలు చేసిన హెచ్చరికలు, ఆందోళనలపై బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్‌ తన ట్విట్టర్‌లో తీవ్రంగా ఖండించారు. ‘కొద్ది రోజులుగా కళాకారులపై దాడులకు పాల్పడతామని.. హెచ్చరికలు చేస్తుండటం ఆందోళనకర పరిణామని అని అన్నారు. పలు భాష్లలో విశృంఖలంగా నిర్మితమవుతున్న అశ్లీల చిత్రాల గురించి నోరు మెదపని వాళ్లు.. చారిత్రతాత్మక, సందేశాత్మక చిత్రాలో నటించిన, నటిస్తున్న కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం ఎంత వరకు సమంజసమని' ఆయన ప్రశ్నించారు.

     నిరసన కారుల నుంచి ఇలా హెచ్చరికలు

    నిరసన కారుల నుంచి ఇలా హెచ్చరికలు

    పద్మావతి మూవీ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న దీపికా పదుకోనేకు ముంబై పోలీసులు భద్రత పెంచారు. రాజ్‌పుత్‌ కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆమెకు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాణీ పద్మినిగా పద్మావతిలో నటించిన దీపికా పదుకోన్‌కు నిరసనకారుల నుంచి తీవ్ర హెచ్చరికలు ఎదురయ్యాయి. కర్ణిసేన హెచ్చరిక నేపథ్యంలో దీపికకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. సినిమా విడుదల రోజున రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రత ఏర్పాటు చేస్తామని కర్ణాటక హోమంత్రి రామలింగా రెడ్డి తెలిపారు.

    ఆచితూచి స్పందించాలని సుప్రీంకోర్టు సూచన

    ఆచితూచి స్పందించాలని సుప్రీంకోర్టు సూచన

    రాణి పద్మావతి వ్యక్తిత్వాన్ని అవమానించేలా ఈ చిత్రంలో చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సినిమాలు తీసేవారి వాక్స్వాతంత్ర్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించకూడదని.. వివాదాస్పద చిత్రాలు, పుస్తకాలు వంటివాటిపై నిషేధం విధించే క్రమంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+