అమెరికా ఆయుధాలతో పహల్గాం ఉగ్రదాడి? దర్యాప్తులో షాకింగ్ ! రంగంలోకి ఎన్ఐఏ..!
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన పాక్ ఉగ్రమూకల దాడి దేశాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఇందులో బయటపడుతున్న విషయాలు దేశ ప్రజలను షాక్ కు గురి చేస్తున్నాయి. దాడి జరిగిన విధానంతో పాటు అందులో వాడిన ఆయుధాలపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఇందులో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆయుధాలతో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పహల్గాంలో జరిగిన దాడిపై దర్యాప్తు సంస్థలు అందించిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కనీసం నలుగురు ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి బైసారన్ గడ్డి మైదానానికి వచ్చినట్లు తేలింది. అలాగే వీరు అమెరికన్ తయారీ ఎం4 కార్బైన్ అస్సాల్ట్ రైఫిల్స్ , అలాగే ఏకే-47 లతో కాల్పులు జరిపారని వెల్లడైంది. ఈ దాడి జరిగిన రోజు సాయంత్రం ఘటనా స్థలం నుండి 50-70 ఉపయోగించిన కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో అమెరికా ఆయుధాలతో ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడినట్లు అర్దమవుతోంది. అయితే వీరికి అమెరికా ఆయుధాలు ఎలా లభించాయన్న దానిపై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇలా జరిగే అవకాశం లేదు. దీంతో జమ్మూ-కాశ్మీర్ పోలీసులు చేస్తున్న దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడి బాధితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు తీవ్రవాదులు సహా మొత్తం నలుగురు విదేశీయులు ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. వీరంతా సైనికుల్ని పోలిన దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు, ఎం4 కార్బైన్ అస్సాల్ట్ రైఫిల్స్‌ను తీసుకువెళుతుండగా, మిగిలిన ఇద్దరు ఏకే 47లను తీసుకువెళుతున్నారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications