పాక్ హై కమిషనర్ కు సమన్లు .. గగనతలంలో దాడి నేపథ్యంలో భారత్ చర్యలు
న్యూఢిల్లీ : పాకిస్థాన్ పై వైమానిక దాడులతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, పాకిస్థాన్ గగనతలంలో జెట్, మిగ్ విమానాలు ఢీ కొనడంతో పరిస్థితి తీవ్రతకు అద్దపట్టింది. పాక్ చేసిన దాడుల్లో ఓ మిగ్ విమానం, ఐఏఎఫ్ పైలట్ ఆచూకీ తెలియడం లేదు. దీనిపై భారత్ దౌత్యపరంగా చర్యలు తీసుకుంది.
పాక్ హై కమిషనర్ కు సమన్లు
భారత్ లో ఉన్న హై కమిషనర్ కు బుధవారం మధ్యాహ్నం సమన్లు జారీచేసింది. మంగళవారం భారత్ జైషే మహ్మద్ శిబిరంపై .. ఇవాళ పాకిస్థాన్ చేపట్టిన చర్యలను ఖండించింది. భారత గగనతలంలోకి ఎలా వస్తారని ప్రశ్నించింది. అలాగే మిలిటరీ పోస్టులను టార్గెట్ చేసి .. దాడులు చేయడంపై మండిపడింది.

పాకిస్థాన్ చర్చ దురదృష్టకరం
పాకిస్థాన్ చేపట్టిన ఈ చర్యను దురదృష్టకరంగా భారత్ అభివర్ణించింది. పాక్ భూ భాగంలో నక్కిన ఉగ్ర మూకలను మట్టుబెడితే ఆ దేశం స్పందించడం ఏంటని నిలదీసింది. ఉగ్రవాదులను ఎరిపారేయాల్సిన పాకిస్థాన్ .. ఆశ్రయం ఇవ్వడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మరింత ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. పాకిస్థాన్ చేసిన చర్యలను తప్పుబడుతూ సమన్లు జారీచేసింది. నిన్న పాక్ భూభాగంలో భారత వాయుసేన దాడి చేసిన సంగతి తెలిసిందే.
MEA: Acting High Commissioner of Pakistan was summoned this afternoon by MEA to lodge a strong protest at unprovoked act of aggression by Pakistan against India earlier today, including violation of the Indian air space by Pakistan Air Force & targeting of Indian military posts pic.twitter.com/AAuz5oj35c
— ANI (@ANI) February 27, 2019












Click it and Unblock the Notifications