వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో రైల్వే ట్రాక్ ల పేల్చివేతకు భారీ కుట్ర-కేంద్రానికి ఇంటెలిజెన్స్ షాకింగ్ రిపోర్ట్

|
Google Oneindia TeluguNews

భారత్ లో రైల్వే ట్రాక్ లను పేల్చివేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని కోరాయి. దీంతో కేంద్రం కూడా నిఘాను మరింత పెంచబోతోంది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.

పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పెద్ద కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక జారీ చేశాయి.పంజాబ్‌తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్‌ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని హెచ్చరికలు జారీ చేసింది. సరకు రవాణా రైళ్లను ఢీకొట్టేందుకు రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘా సంస్థలు తెలిపాయి.

pakistan isi plans to blow up railway tracks-intelligence report

రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఎస్‌ఐ భారతదేశంలోని తన కార్యకర్తలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా అలర్ట్‌లో పేర్కొన్నాయి. భారత్‌లో ఉన్న పాక్‌ స్లీపర్‌ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని తెలిపాయి. దీంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. గతంలోనూ ఇలాంటి కుట్రలే జరిగినప్పటికీ ఐఎస్ఐ మాత్రం రంగంలోకి దిగలేదు. కానీ ఈసారి నిఘా సంస్ధలు చేస్తున్న హెచ్చరికలపై కేంద్రంలోనూ కలకలం రేగుతోంది. నిఘా హెచ్చరికల నేపథ్యంలో హోంశాఖ తదుపరి చర్యలపై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
intellegence has issued alert to central govt on pakistan isi's plan to blast railway tracks in india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X