రాహుల్ గాంధీపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు..! బీజేపీ తీవ్ర విమర్శలు..!

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఒకరి నుంచి అరుదైన ప్రశంసలు లభించాయి. కేంద్రంపై పోరాడుతున్న రాహుల్ గాంధీపై పాక్ మాజీ కెప్టెన్ కూడా అయిన షాహిద్ అఫ్రిదీ ఓ టీవీ ఇంటర్వూలో అనూహ్యంగా ప్రశంసించాడు. అదే సమయంలో భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. దీంతో బీజేపీ నేతలు శత్రవులంతా మీ ఫ్యాన్సేనంటూ రాహుల్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.

భారత్-పాక్ మధ్య తాజాగా దుబాయ్ లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో తమ దేశానికి చెందిన సమ్మా టీవీలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. భారత్ లో ప్రభుత్వం ఎప్పుడూ మతం, హిందూ-ముస్లిం కార్డును ప్రయోగిస్తుంటుందన్నాడు. ఇది వెరీ బ్యాడ్ మైండ్ సెట్ అన్నాడు. అనంతరం రాహుల్ గాంధీ గురించి మాట్లాడాడు.

Pakistan s Shahid Afridi Commends Rahul Gandhi Slams Modi BJP Reacts Strongly

కానీ రాహుల్ గాంధీ చాలా పాజిటివ్ మైండ్ సెట్ కలవారని, ఆయనకు చర్చలపై నమ్మకం ఉందన్నాడు. ఒక్క ఇజ్రాయెల్ ఉంటే సరిపోదా ఇంకొకటి కావాలా అంటూ ప్రశ్నించాడు. తద్వారా గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ తో అతను పోల్చాడు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా అఫ్రిదీ కామెంట్స్ పై వెంటనే స్పందించింది. పలువురు బీజేపీ నేతలు అఫ్రిదీ ఇంటర్వ్యూ వీడియో బిట్ ను షేర్ చేస్తూ రాహుల్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Pakistan s Shahid Afridi Commends Rahul Gandhi Slams Modi BJP Reacts Strongly

భారత్ ను ద్వేషించే వారంతా రాహుల్ గాంధీలో, కాంగ్రెస్ పార్టీలో స్నేహితుల్ని వెతుక్కుంటారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. హఫీజ్ సయీద్ తర్వాత షాహిద్ అఫ్రిదీ రాహుల్ గాంధీని ప్రశంసించారన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. సోరోస్ టూ షాహిద్, ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్ అంటూ పంచ్ లు వేశారు. బీజేపీ ఐటీ సెల్ ఇన్ ఛార్జ్ అమిత్ మాలవీయ కూడా అఫ్రిదీ కామెంట్స్ షేర్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు.హిందూ ద్వేషి, భారత్ పై అవకాశం దొరికినప్పుడల్లా విషం కక్కే అఫ్రిది సడన్ గా రాహుల్ ను ప్రశంసించాడని, ఎందుకు రాహుల్ లో ప్రతీ భారత ద్వేషీ స్వేహితుడిని వెతుక్కుంటాడని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+