వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ఓటమిపై పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారత్ ఓటమిపై పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలయ్యింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇదే మొదటి పరాజయం.

భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పైన, తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పైన విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

భారత జట్టు ఇంకా బంగ్లాదేశ్, జింబాబ్వేలతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

అయితే, భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పాకిస్తాన్‌కు చాలా ముఖ్యమైన మ్యాచ్‌గా విశ్లేషకులు చెబుతున్నారు.

దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధిస్తే ఈ గ్రూప్‌లోనే ఉన్న పాకిస్తాన్ సెమీ ఫైనల్ అవకాశాలు మెరుగయ్యేవి.

టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 పాయింట్ల టేబుల్

పాకిస్తాన్ తన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. మూడవ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది.

దక్షిణాఫ్రికాపై టీమిండియా ఓటమి పాలవడం పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై మీమ్స్‌ల వరద కనిపిస్తోంది.

భారత జట్టు ఓడిపోవడం పట్ల కొందరు పాకిస్తానీయులు ఆనందం వ్యక్తం చేస్తుంటే చాలామంది పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఇండియా కావాలనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

భారత్ ఓటమిపై పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు

మ్యాచ్ ఫిక్సైందంటూ ఆరోపణలు

భారత జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత పాకిస్తాన్ ట్విటర్ ట్రెండ్స్‌లో #fixed ట్రెండ్ అయ్యింది.

పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్ అవకాశాలను దెబ్బకొట్టడానికి భారత జట్టు కావాలనే ఈ మ్యాచ్‌లో ఓడిపోయిందని కొందరు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆరోపణలు చేశారు.

పాకిస్తాన్ అభిమానులు ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టార్గెట్ చేస్తూ మ్యాచ్‌లో వారిద్దరి ఫీల్డింగ్ ప్రమాణాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సునాయాసమైన క్యాచ్‌ను వదిలేయగా, రోహిత్ శర్మ ఈజీ రనౌట్‌ను కూడా చేయలేకపోయాడు.

వాస్తవానికి విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌లో కూడా అభిమానులు ఉన్నారు. విరాట్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా పాకిస్తాన్‌లోని అభిమానులు విరాట్‌కు మద్దతు తెలిపేవాళ్లు.

గతంలో చాలాసార్లు పాకిస్తాన్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీకి బహిరంగంగానే తమ మద్దతును తెలిపారు.

కానీ, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలేయడంతో.. అతడి నుంచి ఆశించింది ఇది కాదంటూ ఒక పాకిస్తానీ క్రికెట్ ఫ్యాన్ ట్వీట్ చేశారు.

https://twitter.com/Irfanbzr38Ali/status/1586941082486685697

ఇర్ఫాన్ అలీ అనే అభిమాని ట్విటర్‌లో విరాట్ కోహ్లీని ట్యాగ్ చేస్తూ.. ''సర్, పాకిస్తాన్ నుంచి మీరు ఎంతో ప్రేమను పొందుతుంటారు. అంతటి అభిమానం మీకు భారత్‌ నుంచి కూడా లభించకపోవచ్చు. మేం బాబర్, రిజ్వాన్‌లను కూడా పక్కనపెట్టి మిమ్మల్ని కింగ్‌గా అభివర్ణించేవాళ్లం. కానీ మీరు మాత్రం ఈరోజు పాకిస్తానీయుల హృదయాలను ముక్కలు చేశారు. మీరు అద్భుతంగా నటించారు. మీ నుంచి ఇలాంటిది ఆశించలేదు'' అని ట్వీట్ చేశాడు.

https://twitter.com/fire_flier/status/1586900767029563392

కొందరు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ ఈజీ రనౌట్‌ కూడా చేయలేకపోయాడంటూ ఎద్దేవా చేశారు.

కొందరు మాత్రం భారత జట్టు ప్రదర్శనపై పాకిస్తాన్ ఆధారపడకూడదంటూ పాక్ క్రికెట్ టీమ్‌కు సలహాలు ఇచ్చారు.

https://twitter.com/fire_flier/status/1586892450727084033

https://twitter.com/Ali57693061/status/1586855351567130625

https://twitter.com/tehseen_mustafa/status/1586839746680168448

https://twitter.com/sbkrwalo/status/1586836654362628096

https://twitter.com/meme_shaka/status/1586844310925975552

https://twitter.com/atang_waddi/status/1586731514997383169

అద్నాన్ అఖ్తర్ అనే యూజర్.. సెమీ ఫైనల్, ఫైనల్‌ ఆడేందుకు అర్హత ఉన్న జట్టు దక్షిణాఫ్రికా అని పేర్కొన్నారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓటమి పాలైన వెంటనే పాకిస్తాన్ జట్టు కరాచీ విమానాశ్రయానికి తిరిగి వచ్చేసి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ భారత జట్టును విమర్శించడం సరికాదని, పాకిస్తాన్ జట్టు తలరాతను టీమిండియా చేతుల్లో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

https://twitter.com/AdnanAkhter22/status/1586834812492455937

భారత జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం తప్పు అని ఉస్మాన్ జాహిద్ భట్ అనే యూజర్ కూడా ట్వీట్ చేశారు.

https://twitter.com/usmansaidit/status/1586831956171448320

భారత్ ఓటమిపై పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు

దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్‌లో ఏం జరిగింది?

సూర్య కుమార్ యాదవ్ మినహా టీమిండియాలో మిగతా ప్లేయర్లు సరిగా బ్యాటింగ్ చేయలేదు.

మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ విఫలం కాగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరుత్సాహపరిచాడు.

ఒక దశలో టీమిండియా 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

20 ఓవర్లకు భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ మొదట్లో భారత బౌలర్లు ప్రతాపం చూపించారు. ఆ జట్టు 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్‌ల భాగస్వామ్యం వల్ల దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

గ్రూప్‌లో భారత జట్టు రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగు పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఈ రెండింటిలో ఒక మ్యాచ్ గెలుపొందినా టీమిండియా సెమీ ఫైనల్స్ చేరుకుంటుంది.

భారత్ ఓటమిపై పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు

పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?

ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు చివరి బంతి వరకూ పోరాడినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్ జట్టు చివరి బంతికి పరాజయం పాలైంది.

కేవలం ఒక పరుగు తేడాతో జింబాబ్వే జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది.

ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓటములు పాకిస్తాన్‌ సెమీ ఫైనల్స్ అవకాశాలను భారీగా గండికొట్టాయి.

నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందిన పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ అవకాశాన్ని ఇంకా సజీవంగా ఉంచుకోగలిగింది.

అయితే, ఇప్పుడు పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్స్ చేరాలంటే మాత్రం ఆ జట్టు విజయం సాధిస్తే సరిపోదు.. ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి.

ఈ గ్రూపులో పాకిస్తాన్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికా, భారత్ జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. బంగ్లాదేశ్ జట్టు నాలుగు పాయింట్లతో మూడో స్థానంలోనూ, మూడు పాయింట్లతో జింబాబ్వే జట్టు నాలుగో స్థానంలోనూ ఉన్నాయి.

గ్రూప్ దశలో పాకిస్తాన్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి దక్షిణాఫ్రికాతో.

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా గొప్ప ఫామ్‌తో కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పిచ్‌లు కూడా ఆ జట్టుకు కలిసివస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pakistani fans angry over India for losing against South africa, Virat trolled
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X