సన్ రైజర్స్ బొమ్మ తిరగబడింది గురువా.. !!

శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై సాధించిన అద్భుతమైన 82 పరుగుల విజయం ఆ జట్టుకు కీలకమైన 16 పాయింట్లను తెచ్చిపెట్టింది. సాధారణంగా 12 మ్యాచ్‌లలో 16 పాయింట్స్‌ను ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే మేజిక్ నంబర్‌గా పరిగణిస్తారు. ఈ గెలుపుతో ఇతర జట్ల ప్లేఆఫ్స్ అవకాశాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ అందించిన సమాచారం ప్రకారం.. గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు 94.9 శాతానికి పెరిగాయి. దీనికి భిన్నంగా సన్ రైజర్స్ అవకాశాలు 80 శాతం నుంచి 65.7 శాతానికి పడిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్ అవకాశాలు 80.1 శాతం నుంచి 79.7 శాతానికి తగ్గగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అవకాశాలు స్వల్పంగా 42.7 శాతం నుంచి 42.8 శాతానికి పెరిగింది. నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) ఛాన్సెస్ కూడా 62.5 శాతం నుంచి 62.7 శాతానికి పెరిగాయి.

Sunrisers Hyderabad Slumps as Gujarat Titans Seal Key Victory and reshape Playoff Outlook Picture

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అధిగమించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అర్ధ సెంచరీలతో 168 పరుగులు చేసింది. బౌలింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్లు ప్రఫుల్ హింగ్ (2/17), పాట్ కమిన్స్ (1/20) మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు.

169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. భారీ తేడాతో ఓటమిపాలైంది. కగిసో రబాడా (3/28) ఈ జట్టు టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. జేసన్ హోల్డర్ (3/20) తనదైన శైలిలో రాణించాడు. ప్రసిద్ధ్ కృష్ణ (2/23), మహ్మద్ సిరాజ్ (1/11) వరుస వికెట్లు పడగొట్టి గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. సన్ రైజర్స్ పతనాన్ని శాసించారు.

రబాడా సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. ఉక్కిరిబిక్కిరికి గురి చేశాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రవిచంద్రన్ స్మరన్ ను పెవిలియన్‌కు పంపి సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌ను బద్దలు కొట్టాడు. పవర్‌ప్లేలో సన్ రైజర్స్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిందంటే రబాడా బౌలింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కట్టుదిట్టంగా బంతులేశాడీ సౌతాఫ్రికన్ స్పీడ్ స్టర్.

ఆ తర్వాత జేసన్ హోల్డర్ కూడా చెలరేగిపోయాడు. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వికెట్లను పడగొట్టి ఎస్ఆర్ హెచ్ ఆశలను అడియాశలు చేశాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన 19 పరుగులే ఆ జట్టు మొత్తానికీ టాప్ స్కోర్. ఏ ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. భారీ భాగస్వామ్యం అనేది అస్సలు లేనే లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+