Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బిగ్ షాక్..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు ఈ సీజన్ లే ఏదీ కలిసి రావడం లేదు. ఈ సీజన్ లో ఆడిన మ్యాచ్ లల్లో ముంబైని గెలిపించడంలో కెప్టెన్ గా, వ్యక్తిగతంగా కూడా విఫలమైన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ ప్రవర్తన వివాదాస్పదమైంది. దీంతో బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన కింద 10 శాతం మ్యాచ్ ఫీజులో కోత పెట్టింది.
బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1 నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లోని 10వ ఓవర్‌లో హార్దిక్ తన రన్-అప్‌కు తిరిగి వెళ్తుండగా, వికెట్ బెయిల్స్‌ను బలంగా పడగొట్టాడు. మ్యాచ్ సమయంలో ఇలా క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా ఫిక్స్చర్‌లు, ఫిట్టింగులను దుర్వినియోగం చేయడానిక సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను అతను ఉల్లంఘించినట్లు తేలింది.

చిపరికి ఈ మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ సీజన్ లో వరుస ఓటములతో ఇప్పటికే టోర్నీ ప్లేఆఫ్ రేసుతో పాటు టోర్నీ నుంచే నిష్కృమించిన ముంబై.. ప్రస్తుతం మిగిలిన మ్యాచ్ లు ఆడుతోంది. ఇప్పుడు ముంబైకి ఇతర జట్ల అవకాశాలను చెడగొట్టడం మినహా మిగిలిన అవకాశమేదీ లేదు. ఇలాంటి సమయంలో కూడా హార్దిక్ పాండ్యా.. తన అసహనాన్ని ప్రదర్శించి ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన కింద చర్యలకు గురి కావడం చర్చనీయాంశంగా మారుతోంది.














Click it and Unblock the Notifications