students: అందమైన అమ్మాయి అక్కడ ?, యంగ్ బాడీబిల్డర్ అనుమానాస్పద స్థితిలో శవమై ?, డౌట్ !
బెంగళూరు/కొడుగు: కాలేజ్ లో చదువుకుంటున్న కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు చిన్నచిన్న విషయాలకు సహనం కోల్పోతున్నారు. మంచి చదువులు చదువుతున్న యువతి, యువకులు ఆవేశంలో వాళ్లు తీసుకుంటున్న నిర్ణయాలతో వారి కుటుంబ సభ్యులకు కన్నీరు మిగిల్చి వెళ్లిపోతున్నారు. చదువులో ముందు ఉండే అందమైన అమ్మాయి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాగా చదువుకుంటూ బాడీబిల్డర్ పోటీల్లో పాల్గొంటున్న యువకుడు అతని రూమ్ లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.

కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లిన యువతి ?
ప్రకృతి రమణీయ ప్రదేశంగా కర్ణాటకలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మడికేరిలోని మడికేరి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పారామెడికల్ కాలేజ్ జస్మిత (19) అనే యువతి చదువుకుంటున్నది. కాలేజ్ నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లిన జస్మిత తరువాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొడగు జిల్లా కుశాలానగర్‌కు చెందిన సంతోష్ కుమార్తె జస్మిత తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

అందమైన అమ్మాయి..... చదువులో ఫస్ట్
మడికేరి మెడికల్ కాలేజీలో పారామెడికల్ చదువుతున్న జస్మిత చదువులో ముందుండేదని, సాటి స్నేహితులతో కలిసి చాలా చలాకీగా ఉండేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. జస్మిత చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తోందని ఆశపడిన జస్మిత కుటుంబ సభ్యులు కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. కుశాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. జస్మిత ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు తెలిపారు.

రూమ్ లో శవమైన యువ బాడీబిల్డర్
బెంగళూరులో యువ బాడీబిల్డర్ ఉరి వేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా శవమై కనిపించడం కలకలం రేపింది. బెంగళూరులోని కె.ఆర్. పురం సమీపంలోని హిరండహళ్లిలోని రూమ్ లో నివాసం ఉంటున్న బాడీ బిల్డర్ శ్రీనాథ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడంతో సాటి బాడీ బిల్డర్లు, విద్యార్థులు హడలిపోయారు.

ఏదో చేశారని కేసు పెట్టిన తల్లిదండ్రులు
ఈస్ట్ పాయింట్ కళాశాలలో ఫార్మా డి చదువుతున్న శ్రీనాథ్ స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటున్నాడని పోలీసులు అన్నారు. చదువు ముందు ఉంటున్న శ్రీనాథ్ బెంగళూరులో, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవాడని పోలీసులు చెప్పారు. కోలారు జిల్లాలోని శ్రీనివాసపురం (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం)నికి చెందిన శ్రీనాథ్ బెంగళూరులో నివాసం ఉంటూ చదువుకుంటున్నారు. అయితే శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని ఎవరో ఏదో చేశారని అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసు కేసు పెట్టారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications