Parliament: లోక్ సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్-చొరబాటుపై రచ్చరచ్చ..!

నిన్న పార్లమెంటులోకి ఇద్దరు అగంతకులు చొరబడి రచ్చరచ్చ చేసిన వ్యవహారంపై ఇవాళ ఉభయసభలూ దద్దరిల్లాయి. కేంద్రం దీనిపై సమాధానం చెప్పాలని కోరుతూ ఇరు సభల్లోనూ విపక్షాలు పట్టుబట్టాయి. హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేశాయి. అయితే బీజేపీ ఎంపీలు దీన్ని తిప్పికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఉభయసభలు వరుసగా వాయిదాలు పడుతున్నాయి. ఇదే క్రమంలో లోక్ సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల్ని ఈ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల 11వ రోజు అయిన ఇవాళ నిన్న భద్రతా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో ఉభయ సభలు వాయిదాలు పడుతూ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమయ్యాయి. అనంతరం కూడా ఉభయ సభల్లో 'పీఎం సదన్‌ మే ఆవో (ప్రధాని సభకు రావాలి), అమిత్‌ షా శరం కరో' (అమిత్ షా సిగ్గుపడాలి) అంటూ నినాదాలు చేస్తూ విపక్ష నేతలు నిరసన తెలిపారు.

Parliament live: 5 congress mps suspended for disrupting loksabha proceedings over security flaw

ఈ గందరగోళం మధ్య దుష్ప్రవర్తన కారణంగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్‌ను సెషన్‌ పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభ ఛైర్ జగ్దీప్ ధన్కడ్ ఓబ్రియాన్ ప్రవర్తన అమాయకమైన దుష్ప్రవర్తన, అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. అటు లోక్ సభలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, డీన్ కురియకోస్, జోతి మణి, రమ్య హరిదాస్‌లను సస్పెండ్ చేశారు.

మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ సవరణ అనంతరం క్రిమినల్ లా బిల్లులను చర్చ కోసం ప్రవేశపెట్టనున్నారు. మూడు కొత్త క్రిమినల్ చట్ట బిల్లులు భారతీయ న్యాయ సంహిత, 2023, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో; భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కోసం మరియు భారతీయ సాక్ష్య బిల్లు, 2023, భారతీయ సాక్ష్యాధారాల చట్టం, ప్రస్తుత చట్టాల స్థానంలోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+