Parliament: లోక్ సభలో ఇండియన్ అంటార్కిట్ బిల్లు ఆమోదం-రాజ్యసభలో ప్రైవేటు బిల్లుల చర్చ

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఐదోరోజూ ఓ మోస్తరుగా సాగాయి. ధరల పెరుగుదల, రోజువారీ నిత్యావసరాలపై జీఎస్టీ విధింపు, ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాల నిరసనలతో వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజు చర్చలపై ప్రభావం పడింది. ఉదయం ప్రారంభమైన వెంటనే ఉభయసభలూ విపక్షాల నిరసనలతో వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశమైన తర్వాత లోక్‌సభ మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అనంతరం కూడా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. జూలై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత, పార్లమెంటు ఉభయ సభలు ఇంకా ఎటువంటి ముఖ్యమైన వ్యవహారాలను నిర్వహించలేదు.అయితే ఇవాళ లోక్ సభలో మాత్రం కీలకమైన ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు మాత్రం సభ ఆమోదం తెలిపింది.

లోక్‌సభ ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు, 2022పై ఆమోదం తెలిపిన తర్వాత సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ ప్రైవేట్ సభ్యుల బిల్లులపై చర్చ చేపట్టింది. రాజ్యసభలో సామూహిక జన హనన ఆయుధాల బిల్లుపై చర్చ జరగాల్సి ఉండగా... విపక్షాల నిరసనలతో అది కాస్తా సోమవారానికి వాయిదా పడింది. దీంతో ప్రైవేటు మెంబర్ బిల్లులపై చర్చ తర్వాత రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

 Parliament Mansoon Session2022 Day5:LS pass Indian Antarctic Bill 2022,RS on Private Bills

Recommended Video

    Ott చేస్తున్న దారుణం, పైరసీ ను ఎలా పెంచుతుంది అంటే? *Entertainment | Telugu OneIndia

    మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ టార్గెట్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో పాటు అగ్నిపథ్ వంటి అంశాలపై సభలో నిరసనలు తెలుపుతున్న ఎంపీలు.. ఇవాళ బయట కూడా తమ నిరసన గళం వినిపించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో పార్లమెంటు కార్యకలాపాలపై విపక్షాల నిరసనల ప్రభావం తప్పేలా లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+