Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్ సభ నుంచి మరో 33మంది ఎంపీల సస్పెన్షన్- 47కు చేరిన ఎంపీల బహిష్కరణలు..

పార్లమెంట్ లో చొరబాట్ల వ్యవహారం ఇవాళ కూడా ఉభయసభల్ని కుదిపేసింది. దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఎంపీలకు సమాధానం చెప్పాల్సిన కేంద్రం తప్పించుకుంటోంది. ఇవాళ కూడా విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో ఉభయసభల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎంపీలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన లోక్ సభ స్పీకర్ .. వారు వినకపోవడంతో మరో 33 మంది ఎంపీల్ని ఇవాళ సస్పెండ్ చేశారు.

Parliament Security Breach Protests-33 more mps suspended from loksabha, total reached to 47 now

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై నిరసన చేపట్టి ఇవాళ లోక్ సభ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీల్లో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ సహా మొత్తం ముప్పై మూడు మంది ఉన్నారు. ఇవాళ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు వీరిపై ఈ సెషన్ ముగిసేవరకూ సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలేఖ్ అనే ముగ్గురు ఎంపీలు స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. అనంతరం ఎంపీల సస్పెన్షన్ ను సభ ఆమోదించి రేపటికి వాయిదా పడింది.

గతవారం పార్లమెంట్ లోకి నలుగురి చొరబాటు తర్వాత లోక్ సభలో చెలరేగిన నిరసనల్లో 14 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వీరిలో 9 మంది కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారు. పార్లమెంట్ లో చొరబాటుకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వీరు నిరసనకు దిగడంతో స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం ఇవాళ మరోసారి ఇవే ఘటనలు రిపీట్ కావడంతో మరో 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో లోక్ సభ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీల సంఖ్య 47కు చేరింది. రాజ్యసభ నుంచి గతవారం టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండ్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+