Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Parliament special session LIVE: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేయబోతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి ఎన్నికలు లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది.

దీన్ని మరింత బలపరిచేలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి.

Parliament special sessions live updates in telugu: Know the bills that will be tabled

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వేదికపై ఆసీనులవుతారు.

Sep 19, 2023, 3:19 pm IST

వైయస్ షర్మిలా కామెంట్స్

మహిళా బిల్లుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలపడం శుభపరిణామం - మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. - జనాభాలో సగభాగమైన మహిళలు సమాన హక్కు పొందే రోజు కోసం ఎదురుచూస్తున్నా
Sep 19, 2023, 3:16 pm IST

మోదీజీ ఆలోచన భేష్

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రతి మహిళకు దక్కిన విజయంగా భావించాలి. ప్రధాని మోదీ ఆలోచనకు, మహిళల అభ్యున్నతి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు భేష్ : నటి కంగనా రనౌత్
Sep 19, 2023, 3:14 pm IST

Parliament special sessions: నటి ఇషా గుప్తా కామెంట్స్

కేంద్ర ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. మహిళలకు ఇక నుంచి చట్టసభల్లో సమాన హక్కులు కలిగి ఉంటాయి. మోదీ నిర్ణయానికి సలాం చేస్తున్నాను: నటి ఇషా గుప్తా
Sep 19, 2023, 3:11 pm IST

Parliament special session: మహిళల సంబరాలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ మహిళా బీజేపీ విభాగం సంబరాలు చేసుకుంది.
Sep 19, 2023, 3:10 pm IST

Parliament special sessions:చరిత్రలో నిలిచిపోయే రోజు

ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: రాజ్యసభలో ప్రధాని మోదీ
Sep 19, 2023, 2:32 pm IST

తేలేది రేపే

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఆ వెంటనే స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి అంటే 20వ తేదీకి వాయిదా వేశారు.
Sep 19, 2023, 2:28 pm IST

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.
Sep 19, 2023, 2:26 pm IST

పెద్దల సభలో..

కొత్త పార్లమెంట్ భవనంలో రాజ్యసభ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. కొద్ది సేపటికే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2:47 నిమిషాలకు సభ మళ్లీ సమావేశం కానుంది.
Sep 19, 2023, 2:07 pm IST

నారీ శక్తి వందన్ అభియాన్..

కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ. నారీ శక్తి వందన్ అభియాన్‌గా పేరు పెట్టినట్లు వెల్లడి.
Sep 19, 2023, 1:51 pm IST

ఎన్నికలపై మోదీ

కొత్త పార్లమెంట్ భవనంలో ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, అధికార పక్షంలో ఎవరు కూర్చుంటారు? ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారనేది వారి వ్యవహార శైలి నిర్ధారిస్తుందంటూ కామెంట్స్
Sep 19, 2023, 1:38 pm IST

కొత్త పార్లమెంట్‌లో తొలి ప్రసంగం

కొత్త పార్లమెంట్‌లో సమావేశమైన సందర్భంగా ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు. సభ్యులందరికీ ఆయన స్వాగతం పలికారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Sep 19, 2023, 1:37 pm IST

నేడే బిల్లు

చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లును నేడే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రకటించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.
Sep 19, 2023, 1:35 pm IST

చారిత్రాత్మక సందర్భం

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించుకోవడాన్ని దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా, చారిత్రాత్మక సందర్భంగా అభివర్ణించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.
Sep 19, 2023, 1:33 pm IST

జాతీయ గీతాలాపనతో..

జాతీయ గీతాలాపనతో కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభమైన కార్యకలాపాలు. స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఓం బిర్లా.
Sep 19, 2023, 1:31 pm IST

జట్టుగా టీఎంసీ సభ్యులు

ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు డెరెక్ ఓబ్రియాన్, అభిషేక్ బెనర్జీ తదితరులు ఒక జట్టుగా కొత్త పార్లమెంట్ భవనం వైపు సాగిపోయారు.
Sep 19, 2023, 1:29 pm IST

మహిళల టీమ్

మహిళ సభ్యులందరూ ఒక జట్టుగా పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టడం ఆకట్టుకుంది.
Sep 19, 2023, 1:27 pm IST

కొత్త పార్లమెంట్‌లో ప్రతిపక్షం

రాజ్యంగ ప్రతితో ప్రతిపక్ష సభ్యులు కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు. రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, రేవంత్ రెడ్డి, కణిమోళి.. ఇలా ఉమ్మడి కూటమి సభ్యులందరూ తమ ఐక్యతను చాటారు.
Sep 19, 2023, 1:25 pm IST

కొత్త భవనంలో ఎంట్రీ

కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయెల్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి తదితరులు.
Sep 19, 2023, 1:22 pm IST

కొత్త పార్లమెంట్ వైపు వడివడిగా

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయెల్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి.. ఇలా కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులందరూ ఒక జట్టుగా కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు.
Sep 19, 2023, 12:50 pm IST

కోటి ఆశలతో కొత్త పార్లమెంట్ భవనంలోకి..

లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ పాత పార్లమెంట్ భవనాన్ని వీడారు. కొత్త భవనంలోకి అడుగుపెట్టారు.
Sep 19, 2023, 12:46 pm IST

సెంట్రల్ హాల్‌లో మోదీ

పాత పార్లమెంట్ భవనాన్ని `సంవిధాన్ సదన్` అని పిలవాలంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి. భావి తరాలకు ఈ భవనాన్ని ఓ బహుమతిగా అందింద్దామని, మహనీయుల జ్ఞాపకాలను చిరస్మరణీయం చేద్దామంటూ పిలుపు.
Sep 19, 2023, 12:09 pm IST

సెంట్రల్‌హాల్‌లో ఖర్గే

పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే.
Sep 19, 2023, 11:50 am IST

సొమ్మసిల్లిన బీజేపీ ఎంపీ

పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో గ్రూప్ ఫొటో సందర్భంగా సొమ్మసిల్లిన బీజేపీ ఎంపీ. సపర్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర సభ్యులు.
Sep 19, 2023, 11:30 am IST

పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సందడి

పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో కోలాహలం నెలకొంది. ఈ భవనంతో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు సభ్యులు పంచుకుంటోన్నారు.
Sep 18, 2023, 2:02 pm IST

Parliament special sessions live: మహిళా రిజర్వేషన్ బిల్లు

మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలంటూ ఫ్లకార్డులను గాంధీ విగ్రహం ఎదుట ప్రదర్శించిన బీఆర్ఎస్ ఎంపీలు
Sep 18, 2023, 2:00 pm IST

Parliament special sessions live: వినాయక చవితి సందర్భంగా..

వినాయక చవితి సందర్భంగా రేపు సమావేశాలను కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహిస్తాం. విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు కాబట్టి..ఇకపై దేశ అభివృద్ధిలో భాగంగా తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆశిస్తున్నాను: ప్రధాని మోదీ
Sep 18, 2023, 1:51 pm IST

Parliament Special sessions live: విజయసాయి రెడ్డికి గౌరవం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డిని ఉపాధ్యక్షుల ప్యానెల్‌లోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
Sep 18, 2023, 1:46 pm IST

Parliament special sessions live: ప్రధాని మోదీ ప్రసంగం పై..

భారత పార్లమెంటు చరిత్ర గురించి మాట్లాడాలంటే రోజులు, గంటలు సరిపోవు. 75 ఏళ్ల ఘన చరిత్ర కలిగి ఉన్న పార్లమెంట్ భవనం గురించి ప్రధాని మోదీ చాలా చక్కగా వివరించారు: చిరాగ్ పాశ్వాన్
Sep 18, 2023, 1:43 pm IST

parliament special sessions live: పార్లమెంట్ కొత్త భవనం

ప్రధాని మోదీ పార్లమెంట్ పాత భవనం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగింది. ఇక పై కొత్త పార్లమెంట్ భవనంకు కూడా అదే స్థాయిలో ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా సిబ్బంది పెరిగారు, కార్యకలాపాలు కూడా మరింతగా పెరుగుతాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Sep 18, 2023, 12:38 pm IST

మణిపూర్ మండుతోంది

మణిపూర్ రాష్ట్రం ఇంకా మండుతోంది. ఇప్పటికీ ప్రధాని మోదీ అక్కడికి వెళ్లలేదు: ఖర్గే
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+