Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. వైసీపీకి కేంద్రం స్పెషల్ గిఫ్ట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆరంభం అయ్యాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ భేటీలో ఎలాంటి అంశాలు, బిల్లులు చర్చకు రానున్నాయనేది ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ భేటీ సందర్భంగా సభలో ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనిపై ఇదివరకే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ సైతం రాశారు. మొత్తంగా ఎనిమిది బిల్లులు సభామోదం పొందే అవకాశాలు ఉన్నాయి.

YSRCPs MP Vijayasai Reddy included in Parliamentary Panel of Vice Chairpersons

కేంద్రంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడే గానీ ఘర్షణ వైఖరికి దిగట్లేదు. స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో తెప్పించుకోగలుగుతోంది వైసీపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిధులు బకాయిలు, జీఎస్టీ వాటాలను సాధించుకుంటోంది.

దీనికి ప్రతిగా పార్లమెంట్‌లో కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి అండగా నిలుస్తోంది. ఇదే వైఖరిని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది.. ఎన్డీఏలో భాగస్వామ్యపక్షం కాకపోయినప్పటికీ. ఇక బిల్లులను ఆమోదించడంపై కేంద్రానికి మద్దతు పలకడం లాంఛనప్రాయమే.

వైఎస్ఆర్సీపీ మద్దతు కీలకమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. ఆ పార్టీకి గిఫ్ట్ ఇచ్చింది. పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభలో సభాపక్ష నేత వీ విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించింది. ఆయనను పార్లమెంటరీ ఉపాధ్యక్షుల ప్యానెల్‌లో తీసుకుంది. కొత్త ప్యానెల్‌ను ఈ ఉదయం ప్రకటించింది.

ఇందులో విజయసాయిరెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని తీసుకుంది. కాంతా కర్దమ్, సుమిత్రా బాల్మిక్, మమతా మొహంతా, గీత అలియాస్ చంద్రప్రభ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, డాక్టర్ శాంతాను సేన్‌కు చోటు కల్పించింది. ఈ నెల 13వ తేదీన నుంచి కొత్త ప్యానెల్ ఏర్పాటైనట్లు రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+