వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా యజమాని హంతకుడిని పట్టిచ్చిన చిలుక

By Pratap
|
Google Oneindia TeluguNews

Parrot
ఆగ్రా: అసాధారణంగా ఓ చిలుక ఓ హత్య మిస్టరీని ఛేదించింది. చిలుక తన యజమాని హంతకుడి పేరు చెప్పడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పోలీసులు హత్య కేసులో ప్రగతి సాధించారు. ఈ సంఘటనకు సంబంధించిన వార్తాకథనం స్థానిక మీడియాలో వచ్చింది.

విజయ్ శర్మ అనే వ్యక్తి భార్య నీలం హత్యకు గురైంది. ఆమెతో పాటు ఆమె పెంపుడు కుక్క కూడా హత్యకు గురైంది. ఈ హత్య ఈ నెలారంభంలో జరిగింది. సోమవారంనాటి వరకు పోలీసులు ఈ హత్యల మిస్టరీని ఛేదించలేకపోయారు.

జంతు ప్రేమికురాలైన నీలం ఓ శునకాన్ని, ఓ చిలుకను పెంచుకుంది. కుటుంబ సభ్యులు అమర్ ఉజాలాకు ఈ విషయం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నీలం హత్య తర్వాత చిలుక ఆహారం తీసుకోవడం మానేసింది.

విజయ్ సమీప బంధువు ఆశు ఇంటికి వచ్చినప్పుడు చిలుక భయంతో వణికిపోతూ పంజరంలోకి వెళ్లిపోతూ వచ్చింది. మిగతా రోజుల్లో మాత్రం ఇళ్లంతా తిరుగుతూ ఉండేది. రెండు రోజుల క్రితం విజయ్ ఇంటి వచ్చి చిలుకతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. అయితే, అది ఉలుకలేదు, పలుకలేదు.

తన భార్య హత్య కేసులో అనుమానితుల పేర్లను వినిపిస్తూ విజయ్ ముందుకు సాగాడు. చివరకు చిలుకలో కదలిక వచ్చింది. ఆశు పేరు చెప్పగానే ఉస్నే మారా, ఉస్నే మారా (అతనే చంపాడు, అతనే చంపాడు) అంటూ అరిచింది.

నీలం హత్య కేసులో తొలుత ఆశును కూడా పోలీసులు అనుమానించారు. అయితే, కుటుంబ సభ్యులు పోలీసులతో విభేదించారు. చిలుక నుంచి తనకు సమాచారం అందగానే విజయ్ ఆశును కస్టడీలోకి తీసుకుని, విచారించాలని పోలీసులకు సూచించాడు.

ఆశు, తన అనుచరులతో నీలంను హత్య చేయడానికి ప్రయత్నించినప్పుడు శునకం వారిపైకి దూకింది. కుక్క ఆశు వేలిని కొరికింది కూడా. వారు నీలంను, శునకాన్ని హత్య చేసినట్లు పోలీసులు అమర్ ఉజాలాకు చెప్పారు.

English summary

 According to Amarujala - In an unusual case of cracking a murder mystery, Agra police were able to get breakthrough in the case only after a parrot named the killer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X